AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!

ఇప్పుడు వివిధ సందర్భాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. కొందరు ఇళ్లు కొనేందుకు, మరికొందరు కార్లు కొనుగోలు చేసేందుకు..

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
Personal Loan
Subhash Goud
|

Updated on: Nov 13, 2022 | 1:51 PM

Share

ఇప్పుడు వివిధ సందర్భాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. కొందరు ఇళ్లు కొనేందుకు, మరికొందరు కార్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా డబ్బును బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది వ్యక్తిగత అవసరాలు, వివాహం లేదా కుటుంబ కారణాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటారు. చాలా మంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకుని ఆ డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారు. అలాంటి పని చేయడం ఖచ్చితంగా తెలివైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పర్సనల్‌ లోన్ తో స్టాక్ మార్కెట్ లాంటి చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆర్థిక సలహాదారుల ప్రకారం.. వ్యక్తిగత రుణం తీసుకోవడానికి ఎటువంటి హామీ అవసరం లేదు కాబట్టి, ఈ లోన్‌లపై అత్యధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇతర వాటిలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన తర్వాత ఒక వేళ నష్టపోయినట్లయితే వడ్డీతో పాటు మరింతగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. ఎవరైనా బ్యాంక్ నుండి వ్యక్తిగత రుణంతో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అనవసరంగా పర్సనల్ లోన్ తీసుకోవలసిన అవసరం లేదు. చాలా మంది కస్టమర్‌లకు ముందుగా ఆమోదించబడిన వ్యక్తిగత రుణాలను అందిస్తాయి బ్యాంకులు. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు సిబిల్‌ స్కోర్ ఆధారంగా ఈ రుణాలను అందిస్తాయి. మీరు సులభంగా 10 నుండి 15 లక్షల రూపాయల రుణాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

రుణం లభ్యత కారణంగా అనవసరమైన రుణాలతో ఆర్థిక భారాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఈ సందర్భంలో డబ్బును నిర్దిష్ట వ్యవధిలో వడ్డీతో సహా బ్యాంకుకు తిరిగి ఇవ్వాలి. స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తే లాభాలు రావచ్చు.. లేదా నష్టాలు కూడా రావచ్చు. ఇందులో ఇన్వెస్ట్‌ చేసి ఎంతో మంది నష్టపోయిన వారున్నారు. కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్‌ చేసేందుకు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం పొందడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్