Bank Holidays December 2022: కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్‌లో 13 రోజులు బ్యాంకులు బంద్
ప్రతినెల బ్యాంకులకు సెలవులు ప్రకటించడం అనేది సర్వసాధారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ప్రతి నెల బ్యాంకులు ఏయే రోజు మూసి ఉంటాయనే తేదీలను ప్రకటిస్తుంటుంది..

ప్రతినెల బ్యాంకులకు సెలవులు ప్రకటించడం అనేది సర్వసాధారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ప్రతి నెల బ్యాంకులు ఏయే రోజు మూసి ఉంటాయనే తేదీలను ప్రకటిస్తుంటుంది. అలాగే డిసెంబర్‌లలో కూడా బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గమనించాలి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు జరిపే వారు ముందస్తుగా సెలవులను గమనించి ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. లేకపోతే సమయం వృధా అవుతుంటుంది. అయితే బ్యాంకులు మూసి ఉన్నా ఇంటర్నెట్ బ్యాకింగ్, ఇతర ఆన్‌లైన్ సర్వీసులు ఎలాంటి ఆటంకం ఉండదు. యధావిధిగా కొనసాగుతాయి. ఈ సెలవుల్లో రెండో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయి.
➦ డిసెంబర్ 3 – శనివారం – సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ – గోవాలో బ్యాంకు మూసివేత
➦ డిసెంబర్ 4 – ఆదివారం




➦ డిసెంబర్ 10 – రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉండాలి
➦ డిసెంబర్ 11 – ఆదివారం
➦ డిసెంబర్ 12 – సోమవారం – పా-టాగన్ నెంగ్మింజ సంగం – మేఘాలయలో సెలవు
➦ డిసెంబర్ 18 – ఆదివారం
➦ డిసెంబర్ 19 – సోమవారం – గోవా విమోచన దినం – గోవాలో బ్యాంకు మూసి ఉంటుంది
➦ డిసెంబర్ 24 – శనివారం – క్రిస్మస్, నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి
➦ డిసెంబర్ 25 – ఆదివారం
➦ డిసెంబర్ 26 – సోమవారం – క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ – మిజోరం, సిక్కిం, మేఘాలయలో సెలవు
➦ డిసెంబర్ 29 – గురువారం – గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు – చండీగఢ్‌లో బ్యాంక్ మూసి ఉంటుంది
➦ డిసెంబర్ 30 – శుక్రవారం – యు కియాంగ్ నంగ్వా – మేఘాలయలో సెలవు
➦ డిసెంబర్ 31 – శనివారం – నూతన సంవత్సర వేడుకలు – మిజోరంలో సెలవు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి