AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. 26 నుంచి ఐదు రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

వివిధ లావాదేవీల నిమిత్తం చాలా మంది బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకు పని నిమిత్తం వెళ్లేవారు బ్యాంకు సెలవులను ముందస్తుగా గుర్తించుకోవడం..

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. 26 నుంచి ఐదు రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?
Bank Holidays
Subhash Goud
|

Updated on: Jan 25, 2023 | 5:36 PM

Share

వివిధ లావాదేవీల నిమిత్తం చాలా మంది బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకు పని నిమిత్తం వెళ్లేవారు బ్యాంకు సెలవులను ముందస్తుగా గుర్తించుకోవడం ఎంతో ముఖ్యం. ఎంతో కంటే బ్యాంకులు ఏయే రోజు మూసి ఉంటాయో తెలియకుండా వెళితే సమయం వృధా కావడంతో పాటు కొంత ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంటుంది. ప్రతి నెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్బీఐ. ఈ విషయాలను తెలుసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులను నివారించేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం మంచిది. యాజమాన్యం హామీ ఇచ్చినా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లపై సానుకూల చర్యలు తీసుకోనందుకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) జనవరి 30-31 తేదీల్లో అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.

అయితే బ్యాంకు ఉద్యోగుల ఆరు అంశాల డిమాండ్లపై ఈ సమ్మె జరగనుంది. జనవరి 26 నుంచి 31 మధ్య, బ్యాంకులు జనవరి 27న కేవలం ఒక రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. బ్యాంకు ఖాతాదారులు తమ ముఖ్యమైన పనిని జనవరి చివరి వారంలోపు పూర్తి చేయాలి. లేకుంటే వారు వరుసగా బ్యాంకులు మూసి ఉన్నందున ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బ్యాంకులు ఏయే రోజు మూసి ఉంటాయంటే..

కాగా, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు, 27న ఓపెన్‌ ఉంటాయి. 28న నాలుగో శనివారం, తర్వాత 29న ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇక జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె ఉంది. 27వ తేదీ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వాణిజ్య బ్యాంకుల్లో పనిచేస్తున్న మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉద్యోగుల సంఘం సంయుక్త ఫోరమ్ (యుఎఫ్‌బియు) పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్‌తో పాటు అన్ని ఇతర బ్యాంకర్లు సమ్మెలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డీఎన్ త్రివేది మాట్లాడుతూ.. ఐదు రోజుల బ్యాంకింగ్, పెన్షన్ అప్‌డేషన్, ఎన్‌పీఎస్‌కు బదులుగా పాత పెన్షన్‌ను అమలు చేయడం, వేతన సవరణ, అన్ని కేడర్‌లలో తగిన రిక్రూట్‌మెంట్ వంటి డిమాండ్‌లు జరగాలని, తద్వారా మెరుగైన సేవలు అందుబాటులోకి రావాలన్నారు. అందుకే ఈ సమ్మె చేపట్టినట్లు వారు తెలిపారు. అయితే డిమాండ్లపై గురువారం ముంబైలో జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..