AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: వినియోగదారులకు అలర్ట్‌.. ఆగస్ట్‌ 19న బ్యాంకులు బంద్‌ ఉంటాయా?

Bank Holiday: ఆగస్టు 19వ తేదీ మంగళవారం బ్యాంకులు మూసి ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. అలాగే సాధారణ రోజుల మాదిరిగానే పనులు జరుగుతాయి. మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం కారణంగా ఆ

Bank Holiday: వినియోగదారులకు అలర్ట్‌.. ఆగస్ట్‌ 19న బ్యాంకులు బంద్‌ ఉంటాయా?
Subhash Goud
|

Updated on: Aug 18, 2025 | 9:49 AM

Share

మంగళవారం ఆగస్టు 19న బ్యాంకులు మూసివేసి ఉండనున్నాయి. ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లేవారు బ్యాంకుల సెలవు జాబితాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా మీమీ రాష్ట్రంలో ఆగస్టు 19న బ్యాంకులు తెరిచి ఉన్నాయో లేదో తెలుసుకోండి. రేపు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రమే మూసి ఉంటాయి. అన్ని రాష్ట్రాలలో బ్యాంకు శాఖలు తెరిచి ఉంటాయి. మరి ఆర్బీఐ ఏ రాష్ట్రానికి సెలవు ప్రకటించిందో చూద్దాం.

ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతో తెలుసా?

త్రిపుర రాష్ట్రంలో ఆగస్టు 19వ తేదీ మంగళవారం బ్యాంకులు మూసి ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. అలాగే సాధారణ రోజుల మాదిరిగానే పనులు జరుగుతాయి. మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం కారణంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు. ఆయన 1908 ఆగస్టు 19న జన్మించారు. త్రిపురలో విద్య, పరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన గణనీయంగా దోహదపడ్డారు. ఆయన జన్మదినాన్ని ఇప్పటికీ గౌరవంగా, భక్తితో జరుపుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు తెరిచే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవ అందుబాటులో..

బ్యాంకు సెలవు దినాలలో మీరు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM ద్వారా లావాదేవీలు చేయగలరు. కానీ చెక్ క్లియరింగ్, డ్రాఫ్ట్ తయారీ వంటి సేవలు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: మీకు పీఎం కిసాన్‌ 20వ విడత అందలేదా? నో టెన్షన్‌.. ఇలా చేయండి!