AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?

చాలా మందికి ప్రతి రోజు ఏదో ఒక విధంగా బ్యాంకు పనులు ఉండటం సాధారణం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఇతరులకు బ్యాంకు పనులు తప్పకుండా ఉంటాయి. అలాంటి వారు బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయోనన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూలై నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్న విషయం తెలిసిందే. అయితే..

Bank Holiday: వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?
Bank Holidays
Subhash Goud
|

Updated on: Jul 04, 2024 | 6:48 PM

Share

చాలా మందికి ప్రతి రోజు ఏదో ఒక విధంగా బ్యాంకు పనులు ఉండటం సాధారణం. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఇతరులకు బ్యాంకు పనులు తప్పకుండా ఉంటాయి. అలాంటి వారు బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయోనన్న విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూలై నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్న విషయం తెలిసిందే. అయితే ఈనెలలో నాలుగు రోజులు గడిచినపోయాయి. అయితే జూలై 5 గురు హరగోవింద్ జీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవుదినం కొనసాగడం లేదు. ఈ జన్మదిన వేడుకలు జరుపుకునే రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. ఆర్బీఐ జాబితా ప్రకారం, జమ్మూతో పాటు శ్రీనగర్‌లో రేపు బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోనున్నాయి. ఆ రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయని గుర్తించుకోండి.

వచ్చే వారం నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. సోమవారం, మంగళవారం, జూలై 8, జూలై 9 తేదీలలో చాలా రాష్ట్రాల్లో బ్యాంక్ మూసివేసి ఉండనున్నాయి. ఇది కాకుండా, వచ్చే వారం శని, ఆదివారం బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే వచ్చే వారం ఏడింటికి నాలుగు రోజులు బ్యాంకులు మూత పడబోతున్నాయి. వచ్చే వారం ఏ స్టేట్స్ బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకుందాం.

జూలై 2024లో బ్యాంకు సెలవుల జాబితా – రాష్ట్రాల ప్రకారం..

  • 5 జూలై (శుక్రవారం) గురు హరగోవింద్ జీ జయంతి
  • 6 జూలై (శనివారం) MHIP డే (మిజోరం)
  • 7వ జూలై (ఆదివారం) వారాంతం సెలవు
  • 8 జూలై (సోమవారం) కాంగ్ (రథజాత్ర) (మణిపూర్)
  • 9 జూలై (మంగళవారం) ద్రుక్పా త్షే-జి (సిక్కిం)
  • 13 జూలై (శనివారం) వారాంతం సెలవు
  • 14 జూలై (ఆదివారం) వారాంతం సెలవు
  • 16 జూలై (మంగళవారం) హరేలా (ఉత్తరాఖండ్)
  • 17 జూలై (బుధవారం) ముహర్రం/అషురా/యు తిరోట్ సింగ్ డే (పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, మేఘాలయ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మిజోరాం, కర్ణాటక, మధ్యప్రదేశ్, త్రిపుర) బ్యాంకులు మూసి ఉంటాయి.
  • 21 జూలై (ఆదివారం) వారాంతం సెలవు
  • 27 జూలై (శనివారం) వారాంతం సెలవు
  • 28 జూలై (ఆదివారం) వారాంతం సెలవు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి