AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Finance: బజాజ్ ఫైనాన్స్‌కు షాక్‌.. రూ. 341 కోట్ల జీఎస్టీ ఎగవేతపై నోటీసు..!

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) ద్వారా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, 341 కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై డీజీజీఐ కంపెనీకి ఈ నోటీసు పంపింది. నివేదిక ప్రకారం..

Bajaj Finance: బజాజ్ ఫైనాన్స్‌కు షాక్‌.. రూ. 341 కోట్ల జీఎస్టీ ఎగవేతపై నోటీసు..!
Gst Notice
Subhash Goud
|

Updated on: Aug 09, 2024 | 9:07 PM

Share

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) ద్వారా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, 341 కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై డీజీజీఐ కంపెనీకి ఈ నోటీసు పంపింది. నివేదిక ప్రకారం కంపెనీ రూ.850 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌పై బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అసలు విషయం ఏమిటి?

ఆగస్టు 3న పంపిన నోటీసులో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్వీస్ ఛార్జీని వడ్డీ ఛార్జీగా తప్పుగా వివరించింది. 341 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలపై కంపెనీపై 100 శాతం పెనాల్టీ పడింది. అదే సమయంలో జూన్ 2022 నుండి మార్చి 2024 వరకు రోజుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. మొత్తంగా రూ.850 కోట్లు. నివేదిక ప్రకారం, కంపెనీకి మొత్తం 160 పేజీల నోటీసు పంపింది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

పంపిన నోటీసులో సెంట్రల్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం.. మినహాయింపు పొందడానికి బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ ఛార్జీని వడ్డీ ఛార్జీగా చూపింది. ప్రాసెసింగ్ లేదా సర్వీస్ ఛార్జీలపై పన్ను విధించబడుతుందని డీజీజీఐ తెలిపింది. అయితే వడ్డీ ఛార్జీలపై ఎలాంటి పన్ను ఉండదు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశంలోనే అతిపెద్ద కన్స్యూమర్ ఫైనాన్స్ ఎన్‌బీఎఫ్‌సీ. కంపెనీ ఆస్తుల విలువ రూ.3.54 లక్షల కోట్లు.

ఇది కూడా చదవండి: టెలికాం కంపెనీలకు చుక్కులు చూపిస్తున్న BSNL.. రూ.107తో 35 రోజుల వ్యాలిడిటీ

విచారణ ఎప్పుడు మొదలైంది?

ఆగస్టు 2022లో కేరళలోని కోజికోడ్‌లోని కంపెనీ రిటైల్ అవుట్‌లెట్‌లో జరిపిన విచారణ తర్వాత ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీకి ఇచ్చిన నోటీసులో బజాజ్ ఫైనాన్స్ 65 కార్యాలయాల ద్వారా కస్టమర్లకు రుణాలు అందించింది. దానిపై ‘ముందస్తు వడ్డీ’ వసూలు చేయబడింది.

ఇది కూడా చదవండి: కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌.. రీఛార్జ్‌ ధరలు మళ్లీ పెరగనున్నాయా? టెన్షన్‌ పెడుతున్న ట్రాయ్‌ రూల్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి