Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman card: ఆధార్ కార్డు ఉంటే రూ.5 లక్షల బీమా.. సీనియర్ సిటిజన్లకు పండగే..!

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చు సగటు మధ్యతరగతి కుటుంబాన్ని వేధిస్తుంది. ముఖ్యంగా వయస్సు అయిపోయిన పెద్దవాళ్లకు ప్రతిసారీ ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుంది. వైద్య ఖర్చులు కుటుంబ ఆర్థిక నిర్వహణను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 70 పైబడిన వృద్ధులకు ఉచితంగా రూ.5 లక్షలు విలువైన ఆరోగ్య బీమా అందిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందించే పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Ayushman card: ఆధార్ కార్డు ఉంటే రూ.5 లక్షల బీమా.. సీనియర్ సిటిజన్లకు పండగే..!
Health Insurance
Srinu
|

Updated on: Jul 04, 2025 | 4:26 PM

Share

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రకటించింది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు వారి ఆదాయంతో సంబంధం లేకుండా బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య కవరేజీని అందించడంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవర్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ సీనియర్ సిటిజన్ పథకానికి ప్రత్యేక వెబ్‌సైట్ పోర్టల్, ఆయుష్మాన్ యాప్ ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. 

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు
  • మొబైల్ నంబర్
  • ఈ-మెయిల్ ఐడీ

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

  • సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ కార్డు కోసం అధికారిక జాతీయ ఆరోగ్య అథారిటీ వెబ్‌సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ముందుగా ఎన్‌హెచ్ఏ బెనిఫిషియరీ పోర్టల్‌ని సందర్శించాలి.
  • మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. 
  • 70 సంవత్సరాల అంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం అని ఉన్న బ్యానర్‌పై క్లిక్ చేయాలి. 
  • మీ రాష్ట్రం, జిల్లా, ఆధార్ నంబర్‌ను అందించాలి. 
  • కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ ఓటీపీను ఉపయోగించాలి. అనంతరం ఇటీవలి ఫోటోను అప్‌లోడ్ చేయాలి. 
  • ఆమోదం పొందిన తర్వాత ఆయుష్మాన్ వయ వందన కార్డ్‌ను 15 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొబైల్ అప్లికేషన్ ప్రాసెస్

  • మీ మొబైల్‌లో ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలి.
  • మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. 
  • ఆధార్ సమాచారం, డిక్లరేషన్‌ను అందించాలి. అంటే ఇటీవలి ఫోటోగ్రాఫ్‌ను అప్‌లోడ్ చేయాలి. 
  • లబ్ధిదారుడు, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఆపై ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత వెంటనే కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఓటీపీ ధ్రువీకరణకు సమ్మతి ఇవ్వాలి. 

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్), మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ఈసీహెచ్ఎస్) లేదా ఆయుష్మాన్ సీఏపీఎఫ్ వంటి ఇతర ప్రజారోగ్య బీమా పథకాలలో ప్రస్తుతం చేరిన సీనియర్ సిటిజన్లు తమ ప్రస్తుత పథకాన్ని కొనసాగించడాన్ని ఎంచుకోవచ్చు లేదా ఏబీపీఎం-జేఏవైకు మారవచ్చు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలోకి వచ్చే సీనియర్ సిటిజన్లు కూడా ఏబీ పీఎం-జేఏవై కింద ప్రయోజనాలకు అర్హులు.