Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. తక్షణమే అమల్లోకి వచ్చిన రేట్లు..!
దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్)ని యాక్సిస్ బ్యాంక్ 0.25 శాతం పెంచింది. పెరిగిన..
దేశంలోని మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ వడ్డీ రేటు (ఎంసీఎల్‌ఆర్)ని యాక్సిస్ బ్యాంక్ 0.25 శాతం పెంచింది. పెరిగిన వడ్డీ రేటు తక్షణం అమల్లోకి వచ్చింది. దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన సమాచారం ప్రకారం.. పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబర్ 18, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఒక సంవత్సరం కాలానికి ప్రామాణిక ఎంసీఎల్‌ఆర్ 0.25 శాతం నుండి 8.35 శాతానికి పెరిగింది. అంతకుముందు ఇది 8.10 శాతంగా ఉంది.
రెపో రేటు పెరిగిన తర్వాత వడ్డీ రేటు పెరిగింది:
వాహన, వ్యక్తిగత, గృహ రుణాల రేట్లు ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ ఆధారంగా నిర్ణయించబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెప్టెంబర్ 30న రెపో రేటును 0.50 శాతం పెంచిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ రేటును పెంచింది. ఒక రోజు నుండి ఆరు నెలల వరకు రుణాలపై ఎంసీఎల్‌ఆర్ కూడా 0.25 శాతం పెరిగి 8.15 నుంచి 8.30 శాతానికి పెరిగింది.
ఈ బ్యాంకులు కూడా..
ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేటును రెండేళ్లకు 8.45 శాతానికి, మూడేళ్ల కాలానికి 8.50 శాతానికి పెంచాయి. ఈ రేట్లు తదుపరి సమీక్ష వరకు చెల్లుబాటు అవుతాయని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ రేటును పెంచాయి. ఇది కాకుండా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే వారిపై ఎస్‌బీఐ వడ్డీ రేటును 0.3 శాతం పెంచింది. రూ.10 కోట్ల లోపు డిపాజిట్లు ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీని 0.50 శాతం నుంచి 2.70 శాతానికి ఎస్‌బీఐ సోమవారం తగ్గించింది. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై ఇప్పుడు కస్టమర్లు 3 శాతం వడ్డీని పొందుతారని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి