AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Servicing: బైక్‌ను ఎన్ని కి.మీ తర్వాత సర్వీస్ చేయాలి? సరైన సమయం ఏది?

Bike Servicing: మీరు బైక్ సర్వీసింగ్ కోసం వెళ్ళినప్పుడల్లా సర్వీసింగ్ సమయంలో ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ మారుస్తారు. ఎయిర్ ఫిల్టర్ కూడా మారుస్తారు. ఆయిల్ వేయడమే కాకుండా చైన్ కూడా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రికల్ సిస్టమ్, వైరింగ్ కూడా తనిఖీ..

Bike Servicing: బైక్‌ను ఎన్ని కి.మీ తర్వాత సర్వీస్ చేయాలి? సరైన సమయం ఏది?
Subhash Goud
|

Updated on: Aug 03, 2025 | 12:05 PM

Share

Bike Servicing: బైక్ నడుపుతున్నప్పుడు మీరు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు బైక్ నడుపుతుంటే మీ బైక్‌ను ఎప్పుడు సర్వీస్ చేయించుకోవాలో మీరు తెలుసుకోవాలి. దీనికి సరైన సమాధానం మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. సర్వీసింగ్‌లో ఆలస్యం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

బైక్ సర్వీసింగ్ కి ఇది సరైన సమయమా?

ఇవి కూడా చదవండి

ప్రతి 2000 కి.మీ. కి బైక్ సర్వీస్ చేయాలి. సకాలంలో సర్వీస్ చేస్తే బైక్ పనితీరు, ఇంజిన్ లైఫ్, మైలేజ్ అన్నీ బాగా, బలంగా ఉంటాయి. కొత్త బైక్ మొదటి సర్వీస్ 500-750 కి.మీ. వద్ద చేయాలి. అలాగే ఏదైనా కారణం చేత మీరు 2000 కి.మీలకు సర్వీస్ చేయలేకపోతే ఖచ్చితంగా 2500 కిలోమీటర్ల వద్ద చేయండి. కానీ 2500 కి.మీ. కంటే తరువాత సర్వీస్ చేయవద్దు. మీరు ఇలా చేస్తే క్లచ్ ప్లేట్, పిస్టన్, బైక్ చైన్ కూడా దెబ్బతింటుంది.

ఆలస్యంగా సర్వీసింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే:

మీరు బైక్‌ను సకాలంలో సర్వీస్ చేయకపోతే పిస్టన్ దెబ్బతిన్నట్లయితే. దానిని మరమ్మతు చేయడానికి మీకు దాదాపు 3 వేల రూపాయలు, క్లచ్-పిస్టన్ మరమ్మతు చేయడానికి 4500 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంజిన్ దెబ్బతిన్నట్లయితే మీరు 6 నుండి 7 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

సర్వీసింగ్‌లో ఏమి జరుగుతుంది?

మీరు బైక్ సర్వీసింగ్ కోసం వెళ్ళినప్పుడల్లా సర్వీసింగ్ సమయంలో ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ మారుస్తారు. ఎయిర్ ఫిల్టర్ కూడా మారుస్తారు. ఆయిల్ వేయడమే కాకుండా చైన్ కూడా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రికల్ సిస్టమ్, వైరింగ్ కూడా తనిఖీ చేస్తారు. మీ బైక్ ఇంజిన్ చాలా శబ్దం చేస్తుంటే మీరు దానిని సర్వీస్ చేయించుకోవచ్చు. లేదా మైలేజ్ తక్కువగా ఉంటే, అలాగే బైక్ నుండి పొగ వస్తుంటే మీరు వెంటనే బైక్‌ను సర్వీస్ చేయించుకోవాలి.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి