Gold Buying Tips: సింగారం కోసమే బంగారం కొంటున్నారా? నష్టమెంతో తెలిస్తే షాక్…
ఆభరణాల కోసం బంగారం కొంటే చాలా నష్టపోతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారు ఆభరణాల కొనుగోలులో తరుగు, మజూరీ అనేది బంగారం ధరను చాలా ప్రభావితం చేస్తుంది. అయితే పెట్టుబడి పెట్టే వాళ్లు ఆభరణాల బంగారం కాకుండా ఎస్‌జీబీ బాండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. కాబట్టి ఆభరణాల బంగారం కొనుగోలు చేయడం వల్ల ఎంత మేరకు నష్టపోతామో? వంటి విశేషాలను ఓ సారి తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం కొనుగోలు అనేది సాధారణ విషయం. ప్రపంచ దేశాల్లో బంగారం కొనుగోలు అంటే కేవలం పెట్టుబడి గురించి మాత్రమే చూస్తారు. భారతదేశంలో మాత్రం బంగారం అంటే ఆడవాళ్ల ఆభరణాలు గురించి మాత్రమే ఆలోచిస్తారు. అయితే ఆభరణాల కోసం బంగారం కొంటే చాలా నష్టపోతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారు ఆభరణాల కొనుగోలులో తరుగు, మజూరీ అనేది బంగారం ధరను చాలా ప్రభావితం చేస్తుంది. అయితే పెట్టుబడి పెట్టే వాళ్లు ఆభరణాల బంగారం కాకుండా ఎస్‌జీబీ బాండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. కాబట్టి ఆభరణాల బంగారం కొనుగోలు చేయడం వల్ల ఎంత మేరకు నష్టపోతామో? వంటి విశేషాలను ఓ సారి తెలుసుకుందాం.
నష్టం ఇలా
బంగారు నగల దుకాణంలో 25 గ్రాముల ఆభరణాల బంగారం ప్రస్తుత ధరల ప్రకారం కొనుగోలు చేస్తే దాని తయారీ ధర రూ.11,982 ఉంటుంది. అలాగే బంగారం ధర రూ.1,59,763 ఉంది. అంటే మేకింగ్ ఛార్జీ మొత్తం బిల్లులో 7.5 శాతం అవుతుంది. దీంతో పాటు 3 శాతం జీఎస్టీను పరిగణనలోకి తీసుకుంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఆభరణాలను విక్రయించాలనుకుంటే మనం కొన్న ధరకేంటే దాదాపు 11 శాతం లాభం పొందాలి. అంటే ఆభరణాల బంగారం కొనుగోలు సమయంలో మనం 11 శాతం నష్టపోతున్నాం. అయితే సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయమని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎస్‌జీబీ బాండ్లను కొనుగోలు చేయడం వల్ల మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే ప్రభుత్వ సెక్యూరిటీతో వచ్చే బాండ్ల బంగారం. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. అలాగే మెచ్యూరిటీపై బాండ్లు నగదు రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ బాండ్‌ను భారత ప్రభుత్వం తరఫునన ఆర్‌బీఐ జారీ చేస్తుంది. నవంబర్ 17న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 20న చెల్లించాల్సిన సావరిన్ గోల్డ్ బాండ్‌ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధర యూనిట్‌కు రూ. 6,076గా ఉంటుంది. నవంబర్ 15, 16, 17, 2023 తేదీల్లో మూడు పనిదినాల ముగింపు బంగారం ధరకు సంబంధించిన సాధారణ సగటు ఆధారంగా నవంబర్ 20, 2022న చెల్లించాల్సిన ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధర ఎస్‌జీబీ యూనిట్‌కు రూ. 6,076గా ఉంటుందని పేర్కొంది. కాబట్టి పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు బాండ్లను కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటి మళ్లి విక్రయించినా మీ సొమ్ము మీకు వస్తుంది. అదే ఆభరణాల బంగారంలో పెట్టుబడి పెడితే కచ్చితంగా నష్టపోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..