- Telugu News Photo Gallery Business photos These are best EV scooters in India.. The company's scooters are in the top place..
EV Scooters: భారత్‌లో ఈవీ వాహనాల భూమ్.. టాప్ ప్లేస్‌లో ఆ కంపెనీ స్కూటర్లు..
ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల హవా నడుస్తుంది. అందుకు అనుగుణంగా భారతదేశంలో కూడా ఈవీ వాహనాల కొనుగోలు జోరు పెరిగింది. ఈవీ వాహనాల అమ్మకాల్లో అమెరికా, చైనా తర్వాత భారతదేశమే తర్వాత స్థానంలో ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారు. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏంటో? ఓసారి చూద్దాం.
Srinu | Edited By: Ravi Kiran
Updated on: Nov 22, 2023 | 9:15 PM

అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా అగ్రగామిగా ఉంది. అయితే అమ్మకాల్లో మాత్రం హెచ్చుతగ్గులతో ఉంది. అక్టోబర్ 2023లో ఓలా 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా 19.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

గ్రీవ్స్ ఎలక్ట్రిక్, గత నెలలో 4,019 యూనిట్లను విక్రయించి ఐదో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 3,612 యూనిట్లను విక్రయించింది. అక్టోబర్ 2023లో 11.2 శాతం ఎంఓఎం వృద్ధిని నమోదు చేసింది.

టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల్లో రెండో స్థానంలో ఉంది.. అక్టోబర్ 2023లో టీవీఎస్ సెప్టెంబర్ 2023లో విక్రయించబడిన 15,584 యూనిట్లతో పోలిస్తే ఐ క్యూబ్ 15,603 యూనిట్లను విక్రయించింది. ఇది 0.1 శాతం స్వల్ప ఎంఓఎం వృద్ధిని నమోదు చేసింది.

అత్యంత విజయవంతమైన ఈవీ స్టార్టప్‌లలో ఒకటైన ఏథర్ గత నెలలో 8,027 యూనిట్లను విక్రయించి టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూరు ఆధారిత స్టార్టప్ సెప్టెంబర్ 2023లో 7,151 యూనిట్లను విక్రయించి 12.2 శాతం ఎంఓఎం వృద్ధిని నమోదు చేసింది.

బజాజ్ కంపెనీ ఈవీ వాహనాల అమ్మకాల్లో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం తయారీదారుకు సంబంధించిన ఏకైక ఆల్-ఎలక్ట్రిక్ ఆఫర్ చేతక్. బజాజ్ అక్టోబర్ 2023లో చేతక్‌కు సంబంధించిన 8,430 యూనిట్లను విక్రయించింది. అంటే 18.7 శాతం ఎంఓఎం వృద్ధిని నమోదు చేసింది. పోల్చి చూస్తే బజాజ్ సెప్టెంబర్ 2023లో చేతక్ యొక్క 7,097 యూనిట్లను విక్రయించింది.





























