Farmers: 5 కోట్ల మంది రైతులకు కేంద్రం సర్కార్‌ శుభవార్త

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో చెరకు ఎఫ్‌ఆర్‌పీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా క్వింటాల్‌కు రూ.25 పెంచడం మోడీ ప్రభుత్వం చేసిన అత్యధిక పెరుగుదల. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. చెరకు ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో పండిస్తారు. దేశంలో 5 కోట్ల మందికి పైగా చెరుకు రైతులు ఉన్నారు..

Farmers: 5 కోట్ల మంది రైతులకు కేంద్రం సర్కార్‌ శుభవార్త
Sugarcane
Follow us
Subhash Goud

|

Updated on: Feb 23, 2024 | 3:14 PM

రైతుల ఉద్యమాల నడుమ, ఎన్నికల ముందు దేశంలోని 5 కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ఈ 5 కోట్ల మందికి పైగా రైతులు చెరకు సాగు చేస్తున్నవారే తప్ప మరెవరో కాదు. 2024-25 సీజన్‌లో చెరకు ఎఫ్‌ఆర్‌పీని క్వింటాల్‌కు రూ.25 పెంచి రూ.340కి ప్రభుత్వం ఆమోదించింది. కొత్త చెరకు సీజన్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది. లాభదాయకమైన ధర అంటే ఎఫ్‌ఆర్‌పి అనేది చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర.

బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో చెరకు ఎఫ్‌ఆర్‌పీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా క్వింటాల్‌కు రూ.25 పెంచడం మోడీ ప్రభుత్వం చేసిన అత్యధిక పెరుగుదల. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. చెరకు ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో పండిస్తారు. దేశంలో 5 కోట్ల మందికి పైగా చెరుకు రైతులు ఉన్నారు.

ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. చెరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్‌లో చెరకు న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్‌ఆర్‌పి)ని 10.25 శాతానికి పెంచిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో అన్నారు. ప్రాథమిక రికవరీ రేటు క్వింటాల్‌కు రూ. 340గా ఆమోదించబడింది. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఇప్పటివరకు చెరకు అత్యధిక ధర. ఇది ప్రస్తుత సీజన్ 2023-24 చెరకు FRP కంటే ఎనిమిది శాతం ఎక్కువ.

ఇవి కూడా చదవండి

5 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి

కొత్త ఎఫ్‌ఆర్‌పి చెరకు ఫార్ములా కంటే 107 శాతం ఎక్కువ అని, ఇది చెరకు రైతుల శ్రేయస్సును నిర్ధారిస్తుంది అని ఠాకూర్ అన్నారు. ‘ప్రపంచంలో చెరకుకు భారత్‌ అత్యధిక ధర చెల్లిస్తోంది. సవరించిన FRP అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. అధికారిక ప్రకటన ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం ఐదు కోట్లకు పైగా చెరకు రైతులు, చక్కెర రంగానికి సంబంధించిన లక్షలాది మంది ఇతర వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ హామీని నెరవేర్చేందుకు మా నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు.

ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చెరుకు రైతుల సంఖ్య చాలా ఎక్కువ. ఘజియాబాద్ నుండి సహరన్పూర్, మొరాదాబాద్ వరకు ఉన్న ప్రాంతం చెరకు బెల్ట్‌గా గుర్తించబడింది. మరోవైపు రాష్ట్రీయ లోక్‌దళ్ ఇటీవల ఎన్డీయేలో చేరింది. పశ్చిమ యూపీలో ముఖ్యంగా చెరకు రైతులలో ఇది మంచి పట్టును కలిగి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చెరుకు రైతుల కోసం తీసుకున్న నిర్ణయం ఎన్నికల సమయంలో ఎన్డీయేకు ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి