AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..?

సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ పదాలు మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే సమయంలో లేదా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ స్కోర్ పరిశీలిస్తారు. స్కోర్ మెరుగ్గా లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.

Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..?
Cibil Score
Venkatrao Lella
|

Updated on: Jul 25, 2026 | 11:59 AM

Share

మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే.. ముందుగా గుర్తుకొచ్చేది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్. ఈ స్కోర్ సరిగ్గా లేదని బ్యాంకులు లోన్లు రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే చాలామంది సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ రెండూ ఒకటే అని అనుకుంటారు. అయితే ఈ రెండూ ఒక్కటే కాదు. వీటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. దీని గురించి మీరు తెలసుకోవడం వల్లన రుణాలు దరఖాస్తు చేసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, రుణాలు సులువగా పొందటానికి ఉపయోగపడుతుంది. అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి?

క్రెడిట్ స్కోర్ అంటే.. మీ క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే తీరును తెలిపే మూడు అంకెల నెంబర్లు. రుణ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిలు, క్రెడిట్ హిస్టరీ, ఇటీవలి లోన్ ఎంక్వైరీ వంటి వివరాలను ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. కొత్త రుణాన్ని ఆమోదించే ముందు ఒక రుణగ్రహీత ఎంత ప్రమాదకరమైనవాడో లేదా నమ్మదగినవాడో అర్థం చేసుకోవడానికి బ్యాంకులు ఈ స్కోర్‌ను ఉపయోగిస్తాయని చెప్పవచ్చు.

సిబిల్ స్కోర్ అంటే ఏంటి?

సిబిల్ స్కోర్ విషయానికొస్తే.. భారత్‌లో లైసెన్స్ పొందిన క్రెడిట్ బ్యూరోలలో ఇది ఒకటి. ఈ సంస్థ ఖాతాదారుడి ఆర్ధిక లావాదేవీలు, రుణాలు, ఇతర ఆర్ధిక విషయాలను పరిగణలోకి తీసుకుని ఒక స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉంటుంది. చాలా బ్యాంకులు లోన్ మంజూరు చేసేముందు CIBIL రిపోర్టులపై ఆధారపడతాయి. దీంతో ఇది కేవలం ఒక బ్యూరో అంచనాను మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ప్రజలు తరచుగా సిబిల్ స్కోర్‌.. క్రెడిట్ స్కోర్‌కు మరో పేరుగా ఉపయోగిస్తారు.

సిబిల్, క్రెడిట్ స్కోర్ మధ్య తేడా ఏంటి?

క్రెడిట్ స్కోర్ అనేది ఒక సాధారణ పదం. సిబిల్ స్కోర్ కేవలం ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నుండి మాత్రమే వస్తుంది. ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి ఇతర లైసెన్స్ పొందిన క్రెడిట్ బ్యూరోలు కూడా తమ సొంత క్రెడిట్ స్కోర్‌లను జారీ చేస్తాయి. ప్రతి బ్యూరోకు వేర్వేరు డేటా, స్కోరింగ్ నమూనాలు ఉంటాయి. దీంతో అన్ని సంస్థలు స్కోర్‌లు ఒకేలా ఉండవు. అందుకే బ్యాంకులు వేర్వేరు ఏజెన్సీల రిపోర్టులు పరిశీలిస్తాయి.

Follow Us