Amazon: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్.. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి..
Amazon To Make Devices In Chennai: ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని...
Amazon To Make Devices In Chennai: ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ అగర్వాల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అమెజాన్ చెన్నైలో ఎలక్ట్రానిక్ తయారీ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్స్ లాంటి పరికరాలను అమెజాన్ తయారు చేయనుంది. గ్లోబల్ కంపెనీ అయిన అమెజాన్.. పూర్తి స్థాయిలో ఓ ఇండియన్ కంపెనీ తరహాలో అభివృద్ధి చెందాలి’ అని మంత్రి ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. అమెజాన్ ఈ ఏడాది నుంచే టీవీ స్ట్రీమింగ్ పరికరాల ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే.. తైవానీస్ కంపెనీ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఫాక్స్‌కాన్‌కు చెందిన క్లౌడ్ నెట్‌వర్క్ టెక్నాలజీ సంస్థ ఫైర్ టీవీ స్టిక్‌లను తయారు చేస్తోంది. భారత్‌కు చెందిన వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా వేల సంఖ్యలో ప్రతీ ఏడాది ఫైర్ టీవీ స్టిక్స్‌ను తయారు చేసేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది.
Also Read: AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 9.30 గంటలకు 30 శాతం పోలింగ్. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్..న్యూ అన్ లిమిటెడ్ డేటా స్పీడ్ ప్యాకేజీలు.. ధర ఎంతంటే..