Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్..న్యూ అన్ లిమిటెడ్ డేటా స్పీడ్ ప్యాకేజీలు.. ధర ఎంతంటే..

వోడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం న్యూ అన్ లిమిటెడ్ డేటా స్పీడ్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. అన్ లిమిటెడ్ డైలీ

వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్..న్యూ అన్ లిమిటెడ్ డేటా స్పీడ్ ప్యాకేజీలు.. ధర ఎంతంటే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 16, 2021 | 8:41 PM

వోడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం న్యూ అన్ లిమిటెడ్ డేటా స్పీడ్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. అన్ లిమిటెడ్ డైలీ డేటా ప్యాక్‏లతో రిఛార్జ్ చేసే వారికి రూ.249 మరియు అంతకంటే ఎక్కువ ఉదయం 12 నుంచి 6 గంటల మధ్య హై స్పీడ్ అన్ లిమిటెడ్ డేటా వాడుకునే విధంగా చేస్తుంది. వినియోగదారులు వెబ్‌లో బ్రౌజ్ చేయడంతో పాటు OTT ప్లాట్‌ఫామ్‌లపై బింగ్ చేయడంతో రాత్రి సమయంలో ఎక్కువ డేటా వినియోగించబడుతుందని వోడాఫోన్ ఐడియా తెలిపింది. అందుకే రాత్రి వేళల్లో హై-స్పీడ్ డేటాను ప్రవేశపెట్టడం వల్ల Vi కస్టమర్లు ఇంకా ఎక్కువ సమయం డేటా పొందవచ్చని తెలిపింది.

తమ వినియోగదారులు ఉదయం 12 నుంచి 6 గంటల మధ్య అన్ లిమిటెడ్ హై స్పీడ్ డేటాను పొందేందుకు వీలైతుందని… టెలికాం ఆపరేటర్ తెలిపారు. ప్రస్తుతం వీఐ తన కొత్త కస్టమర్లకు రూ.249 లేదా అంతకంటే ఎక్కవ ప్రయోజనాన్ని పొందనున్నారు. కనీస రీఛార్జ్ రీఛార్జ్ విలువతో పాటు ఆఫర్ కూడా పొందుతారు. ఇందుకు ఎలాంటి లిమిట్స్ లేవు. వినియోగదారులు తమ ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో వారాంతపు డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇది Vi కస్టమర్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు శనివారం మరియు ఆదివారం సేకరించిన డేటాను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. కరోనా మహామ్మారి కారణంగా చాలా మంది ఇంట్లోనే ఉండడంతో వెబ్ బ్రౌజ్ చేసేటప్పుడు మరియు ఓటీటీ ప్లాట్ ఫాంలలో కంటెంట్ చూడడం వలన డేటా వినియోగం పెరిగిపోయింది. యూత్ ఎక్కువగా రాత్రి వేళల్లో డేటాను వినియోగిస్తున్నారని.. అందుకోసమే అన్ లిమిటెడ్ హై స్పీడ్ డేటా ప్యాక్ అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. ఈ ఆఫర్ తీసుకురావడం వలన కొత్త కస్టమర్లను పెంచుకునేందుకు తోడ్పడుతుందని వీఐ సంస్థ అధికారులు తెలిపారు.

ఓక్లా నివేధిక ప్రకారం Vi క్యూ 3 2020 కోసం వరుసగా 13.74Mbps మరియు 6.19Mbps వద్ద 4G డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది. ఎయిర్‌టెల్ 13.58Mbps డౌన్‌లోడ్ మరియు 4.15Mbps అప్‌లోడ్ వేగంతో దగ్గరగా ఉంది. జియో వరుసగా 9.71Mbps మరియు 3.41Mbps డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో మూడవ స్థానంలో ఉంది. ఏదేమైనా, జనవరి 2021 చివరిలో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుండి 2020 నవంబర్ నెలలో చందాదారుల డేటా Vi 2.89 మిలియన్ల మంది సభ్యులను కోల్పోయిందని తెలిపింది.

Also Read:

బైక్ లవర్స్‏కు గుడ్‏న్యూస్.. భారత్‏లోకి హోండా న్యూ మోడల్.. ధర ఎంతో తెలుసా ..