AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్ లవర్స్‏కు గుడ్‏న్యూస్.. భారత్‏లోకి హోండా న్యూ మోడల్.. ధర ఎంతో తెలుసా ..

బైక్ ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవాలి. మార్కెట్లోకి ఎన్ని రకాల బైక్స్ వచ్చినా.. యూత్‏ని అట్రాక్ట్ చేస్తునే ఉంటాయి. ఇక భారత్‏లోకి మరో న్యూమోడల్ బైక్ రాబోతుంది.

బైక్ లవర్స్‏కు గుడ్‏న్యూస్.. భారత్‏లోకి హోండా న్యూ మోడల్.. ధర ఎంతో తెలుసా ..
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2021 | 6:38 PM

Share

బైక్ ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవాలి. మార్కెట్లోకి ఎన్ని రకాల బైక్స్ వచ్చినా.. యూత్‏ని అట్రాక్ట్ చేస్తునే ఉంటాయి. ఇక భారత్‏లోకి మరో న్యూమోడల్ బైక్ రాబోతుంది. ఫేమస్ బైక్ తయారీ సంస్థ హోండా తన సిబి 350 ఆర్ఎస్‏ను ఇండియాలో విడుదల చేసింది. దీని ధర ఏకంగా రూ.1.96 లక్షలుగా ప్రకటించింది. హోండా కంపెనీ సీబీ 350 RS అనేది హోండా హన్నెస్ సీబీ 350 నుంచి వచ్చింది. గతేడాది దీనిని ప్రారంభించారు. ఫేమస్ బైక్ రాయల్ ఎన్‏ఫీల్డ్ 350కి ఇది ప్రత్యర్థి. హోండా సీబీ 350 యొక్క 10,000 యూనిట్లకు పైగా దీనిని విక్రయించినట్లు తెలిపారు.

హోండా CB350 RS డిజైన్ మరియు స్టైలింగ్ తేడాలు..

హోండా CB350 RS మరియు Hness CB350 చూడటానికి రెండు ఒకేలా కనిపిస్తాయి. Hness CB350 లాగే ఈ సీబీ350 కూడా అదే బేస్ డిజైన్‏ను కలిగి ఉంటాయి. 15 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, డిజీ అనలాగ్ ఇన్‏స్ట్రుమెంటేషన్ మరియు 7y స్పోక్‏లతో 19 అంగుళాల ఫ్రంట్ అల్లాయ్ వీల్‏ను కలిగి ఉంటుంది. ఫోర్క్ గైటర్స్, ఎల్ఈడీ హెడ్ లైట్ కోసం బ్లాక్ అవుట్ రింగ్, స్లిమ్ కొత్త ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్న్, స్కిడ్ ప్లేట్, చంకియర్ డ్యూయల్-స్పోర్ట్స్ టైర్స్, స్రాంబ్లర్-స్టైల్ “టక్ అండ్ రోల్” సీటు, పైకి లేచినట్టుగా బ్లాక్ ఎగ్జాస్ట్ మరియు బ్యాక్ పార్ట్ కొత్తగా డిజైన్ చేయడం, వేరే అండర్ సీట్ ఎల్ఈడీ టెయిల్-లైట్ మరియు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో దీనిని రూపొందించారు.

Hnessతో పోలీస్తే సీబీ350 ఆర్ఎస్ 17 అంగుళాల అల్లాయ్ వీల్ పై అమర్చిన విస్తృత 150 విభాగాల వెనుక టైర్ ఉంటుంది. ఇది Hness 18 కన్నా చిన్నది. సీబీ 350 ఆర్ఎస్ కి ప్రత్యేకంగా రేడియంట్ రెడ్ మరియు డ్యూయల్ టోన్ బ్లాక్ విత్ పెర్ స్పోర్ట్స్ ఎల్లో రంగులలో రూపొందించారు. సీబీ 350 ఆర్ఎస్ కి స్ర్కాంబ్లర్ హింట్ ఉన్నప్పటికీ… దీనికి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్లు లభించవు. మోటార్ సైకిల్ పేరులోని ఆర్ఎస్ రోడ్ సెయిలింగ్‏ను సూచించడంతోపాటు.. ఈ బైక్ మరింతగా టిప్ ఫార్వర్డ్ రైడింగ్‏లాగే పనిచేస్తుందని హోండా ప్రకటించింది.

హోండా CB350 RS ఇంజిన్ మరియు గేర్ బాక్స్ వివరాలు..

హోండా CB350 RS ఇంజిన్ Hnessకి సమానంగా ఉంటుంది. 350 సీసీ ఇందన ఇంజెక్ట్, సింగిల్ సిలిండర్ యూనిట్, 21 హెచ్ పీ మరియు 30 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ హోండా యొక్క సెలక్టబుల్ టార్క్ కంట్రోల్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అలాగే ఐదు స్పీడ్ గేర్ బాక్స్‏ను స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ అందిస్తుంది.

హోండా CB350 RS ధర మరియు డెలివరీ వివరాలు..

హోండా CB350 RS బైక్ ధర రూ.1.96 లక్షలు ఉంది. హోండా సీబీ 350 ఆర్ఎస్ ఖరీదు Hness CB 350 యొక్క డీఎల్ఎక్స్ వేరియంట్ కంటే సుమారు రూ.10,000 ఎక్కువగా ఉంటుంది. అలాగే టాప్ స్పెక్ హెనెస్ డిఎల్ఎక్స్ ప్రో కంటే రూ.3,500 ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ వింగ్ డీలర్ షిప్‏లలో CB 350 RS కోసం బుకింగ్ చేసుకోవచ్చని హోండా సంస్థ తెలిపింది. అలాగే భారత్‏లోకి మార్చిలో రానున్నట్లుగా తెలిపింది. దేశంలో ప్రస్తుతం హోండా సంస్థ 35 బిగ్ వింగ్ అవుట్ లెట్లను కలిగి ఉంది.. మార్చి 2021 చివరినాటికి వీటిని 50పైగా బిగ్ వింగ్ అవుట్ లెట్లకు పెంచనున్నట్లుగా తెలిపింది.

Also Read:

Alert For Slack Users: మీ మొబైల్‌లో ‘స్లాక్‘ యాప్ ఉందా..? అయితే వెంటనే ఈ పనిచేయండి..