AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Luxury Train: ఇకపై రైళ్లలో సీట్లు ఉండవు! ఈ సెటప్ చూస్తే వావ్ అనాల్సిందే!

మనదేశంలో ఇప్పుడిప్పుడే రైల్వే వ్యవస్థ డెవలప్ అవుతుంది. అయితే రైల్వే రంగంలో జపాన్ మనకంటే ఎన్నో రెట్లు ముందుంది. ఎంతలా అంటే జపాన్ లోని రైళ్లలో ఇప్పుడు సీట్లకు బదులు ఏకంగా రిక్లైనర్లను అమర్చుతున్నారు. ఇది ట్రైన్ జర్నీనా లేదా ఫైవ్ స్టార్ హోటలా అన్నట్టు ఉంది అక్కడ సెటప్. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Luxury Train: ఇకపై రైళ్లలో సీట్లు ఉండవు! ఈ సెటప్ చూస్తే వావ్ అనాల్సిందే!
Shimakaze Train
Nikhil
|

Updated on: Oct 03, 2025 | 12:08 PM

Share

రోజురోజుకీ ట్రైన్ జర్నీలు చాలా అప్ డేట్ అవుతున్నాయి. మనదేశంలో కూడా వందేభారత్ వంటి హైస్పీడ్ ట్రైన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో స్లీపర్ కోచ్ లు రాబోతున్నాయి. అలాగే ఫ్యూచర్ లో ఇండియాలో బుల్లెట్ ట్రైన్ కూడా పరుగులు పెట్టనుంది. అయితే ఇదిలాగే కంటిన్యూ అయితే ఇండియాలో జపాన్ తరహాలో హైఎండ్ ప్రీమియం ట్రైన్స్ రావొచ్చు. ఇవి కదిలే ఇంద్రభవనంలా ఉంటాయి. లోపల విలాసవంతమైన సీటింగ్, సైట్ సీయింగ్ కోసం చుట్టూ అద్దాలు.. ఈ ప్రీమియం ట్రైన్స్ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే.

కదిలే ఇంద్రభవనం

జపాన్‌లోని కింటెత్సు రైల్వే సంస్థ షిమకాజే అనే ప్రీమియం సైట్‌సీయింగ్ ట్రైన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు ఒసాకా, క్యోటో, నాగోయా నుంచి ఈస్-షిమా ప్రాంతానికి వెళ్తుంది. అయితే ఇది ప్రపంచంలోని అత్యంత లగ్జరీ ట్రైన్స్ లో ఒకటి. దీని డిజైన్ చూస్తే మతి పోతుంది. ఇందులో సీట్లకు బదులు రిక్లైనర్లు ఉంటాయి. ప్రతి సీటుకి ఎలక్ట్రిక్ లెగ్ రెస్ట్, ఎయిర్ కుషన్ బ్యాక్, లంబార్ సపోర్ట్ ఉన్నాయి. ప్రతి సీటుకూ పర్సనల్ మానిటర్ కూడా ఉంటుంది. అలాగే సైట్ సీయింగ్ కోసం పెద్ద గ్లాస్ విండోలు ఉన్నాయి. వీటితోపాటు  ఈ ట్రైన్ లో కెఫె కార్ రైలు అనే బోగి ఉంటుంది. ఇందులో ఫుడ్ సర్వ్ చేస్తారు. అలాగే ఇందులో వై-ఫై, లగ్జరీ టాయిలెట్స్ ఉంటాయి.

ఇండియాలో కూడా

ఇకపోతే మనదేశంలో కూడా ఇలాంటి ట్రైన్ తీసుకురావాలని రైల్వే ప్రయాణీకులు కోరుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత భారతదేశంలో ప్రీమింయం రైల్వే మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ట్రైన్స్ వస్తే.. రైల్ ప్రయాణం ఒక లగ్జరీ అనుభవంగా మారుతుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.
టెస్టుల్లో అన్‌లక్కీ ప్లేయర్స్ వీరే.! ప్రపంచ రికార్డులు కొట్టినా.