Investors Alert: పెట్టుబడిదారులకు అలర్ట్.. నయా దందా వెలుగులోకి.. వారితో జాగ్రత్తగా లేకపోతే మీ జేబుగుల్లే..!
డబ్బా ట్రేడింగ్ ప్రతినిధులు ఎన్‌ఎస్‌ఈలో రిజిస్టర్డ్ సభ్యుడిగా లేదా అధీకృత వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎక్స్చేంజ్ స్పష్టం చేసింది. ఈ విషయమై అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) పెట్టుబడిదారులకు ఇటీవల ఓ హెచ్చరిక చేసింది. మోసపూరితంగా గ్యారెంటీ రాబడి అని చెప్పి డబ్బా ట్రేడింగ్ (ప్రైవేట్ ట్రేడింగ్)ను నడుపుతున్న వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. డబ్బా ట్రేడింగ్ ప్రతినిధులు ఎన్‌ఎస్‌ఈలో రిజిస్టర్డ్ సభ్యుడిగా లేదా అధీకృత వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎక్స్చేంజ్ స్పష్టం చేసింది. ఈ విషయమై అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్టుబడిదారులను హెచ్చరిస్తూ ఎన్ఎస్ఈ చట్టం ద్వారా నిషేధించినందున స్టాక్ మార్కెట్‌లో హామీ ఇచ్చిన రాబడిని అందించే ఏ వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన సభ్యత్వం తీసుకోవద్దని పెట్టుబడిదారులను కోరింది. ఇలాంటి అక్రమ వ్యాపార ప్లాట్‌ఫారమ్‌లపై వ్యాపారం చేయవద్దని పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నారు. చట్టవిరుద్ధమైన ప్లాట్‌ఫారమ్‌లలో పాల్గొనడం పెట్టుబడిదారుడి సొంత పూచీ, ఖర్చు, పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అక్రమ వ్యాపార ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్ఛేంజ్ ద్వారా ఆమోదించవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి?
డబ్బా అనే పదాన్ని మనం ఇంట్లో వస్తువులను నిల్వ చేయడానికి వాడే కంటైనర్‌గా వ్యవహరిస్తాం. అయితే డబ్బా ట్రేడింగ్ వారి ఖాతాదారుల తరఫున చిన్న కార్యాలయాలు లేదా గృహాల నుంచి కూడా వ్యాపారం చేయడానికి మొబైల్ ఫోన్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించే బ్రోకర్ల అనధికారిక నెట్‌వర్క్‌ను సూచిస్తుంది. డబ్బా ట్రేడింగ్ అనేది షేర్లలో అక్రమ వ్యాపారమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ట్రేడింగ్ రింగ్‌ల నిర్వాహకులు స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్ వెలుపల ఈక్విటీల్లో వ్యాపారం చేయడానికి ప్రజలను అనుమతిస్తారు. డబ్బా ట్రేడింగ్ అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల వెలుపల జరుగుతుంది. ఈ రకమైన ట్రేడింగ్‌లో లావాదేవీలు అనధికారిక ఛానెల్‌లు లేదా ఆఫ్-మార్కెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నిర్వహిస్తారు. అయితే వీటిని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించలేదు.
డబ్బా వ్యాపారం ఎందుకు చట్టవిరుద్ధం?
డబ్బా ట్రేడింగ్‌ను ఎన్ఎస్ఈ చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఎందుకంటే ఇది నియంత్రణ లేకుండా. ధరల తారుమారు, అలాగే ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి మోసపూరిత కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఇది అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల సమగ్రతను కూడా దెబ్బతీస్తుంది. ఇందులో పాల్గొనే పెట్టుబడిదారులకు గణనీయమైన నష్టాలను కలిగిస్తుంది. సెబీ డబ్బా ట్రేడింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకవేళ ఎవరైనా దోషులుగా తేలిన వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. శ్రీ పరస్నాథ్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ పరస్నాథ్ బులియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫారీ టేల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, భరత్ కుమార్ వంటి సంస్థలు డబ్బా లేదా చట్టవిరుద్ధమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను హామీతో కూడిన రాబడిని అందిస్తున్నట్లు ఎన్ఎస్ఈ కనుగొన్న తర్వాత ఈ హెచ్చరిక ప్రకటనలు రావడం గమనార్హం.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి