PF Settlement: పీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. అప్పటిలోపు పీఎఫ్‌ సొమ్ము క్రెడిట్‌ కాకపోతే ఆ సమస్యలు ఉన్నట్లే..!

ఈపీఎఫ్‌ సభ్యులు తమ ఉపసంహరణ లేదా బదిలీ క్లెయిమ్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. వ్యక్తులు తమ దరఖాస్తును ఎలా సమర్పించినా ఆన్‌లైన్‌లో వారి ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల పురోగతిని తనిఖీ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు ఫారం 19ని ఉపయోగించి పీఎఫ్‌ క్లెయిమ్‌ను ఫైల్ చేయవచ్చు. ఈ ఫామ​ ద్వారా పూర్తిగా లేదా పాక్షికంగా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు.

PF Settlement: పీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. అప్పటిలోపు పీఎఫ్‌ సొమ్ము క్రెడిట్‌ కాకపోతే ఆ సమస్యలు ఉన్నట్లే..!
EPFO
Follow us
Srinu

|

Updated on: Aug 22, 2023 | 9:15 PM

ఉద్యోగుల భవిష్య నిధిని అంటే పీఎఫ్‌గా పిలిచే ఖాతా ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలతోపాటు ఆర్థిక భరోసాను కల్పిస్తుంది. ఈ ఖాతా ఉద్యోగుల కోసం తప్పనిసరి పొదుపు, పదవీ విరమణ ప్రణాళికగా మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఫండ్ కార్పస్ వారికి అందుబాటులో ఉంటుంది. ఈపీఎఫ్‌ సభ్యులు తమ ఉపసంహరణ లేదా బదిలీ క్లెయిమ్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. వ్యక్తులు తమ దరఖాస్తును ఎలా సమర్పించినా ఆన్‌లైన్‌లో వారి ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల పురోగతిని తనిఖీ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు ఫారం 19ని ఉపయోగించి పీఎఫ్‌ క్లెయిమ్‌ను ఫైల్ చేయవచ్చు. ఈ ఫామ​ ద్వారా పూర్తిగా లేదా పాక్షికంగా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే సభ్యులు నేరుగా సభ్యుల ఇంటర్‌ఫేస్ నుంచి పీఎఫ్‌ ఫైనల్ సెటిల్‌మెంట్ (ఫారమ్19), పెన్షన్ ఉపసంహరణ ప్రయోజనం (ఫారం10-సీ), పీఎఫ్‌ పార్ట్ విత్‌డ్రావల్ (ఫారమ్31) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . సాధారణంగా పీఎఫ్‌ను క్లెయిమ్‌ చేస్తే దాన్ని పరిష్కరించడానికి సంబంధిత ఈపీఎఫ్‌ఓ ఆఫీస్‌కు దాదాపు 20 రోజులు పడుతుంది. ఈ సమయంలోపు క్లెయిమ్‌ సెటిల్‌కాకపోతే ఖాతాదారులు ఏం చేయాలో? ఓ సారి తెలుసుకుందాం. 

ఇరవై రోజుల్లో పీఎఫ్‌ ఖాతా సెటిల్‌ కాకపోతే ఇలా చేయాల్సిందే

ఇరవై రోజుల్లో పీఎఫ్‌ క్లెయిమ్‌కాకపోతే ఖాతాదారుని గ్రీవెన్స్‌కు బాధ్యత వహించే ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ను సంప్రదించాలి. అలాగే ఉద్యోగుల కోసం విభాగంలోని ఈపీఎఫ్‌ఐజీఎంస్‌ ఫీచర్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌లో ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు. 

ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ ఇలా

  • స్టెప్‌-1: ఈపీఎఫ్‌ఓ ​​పోర్టల్‌లో మెంబర్ ఈ-సేవా పోర్టల్‌కు వెళ్లాలి.
  • స్టెప్‌-2 : అక్క లాగిన్‌ వివరాలు నమోదు చేసి ఖాతాకు లాగిన్‌ అవ్వాలి. 
  • స్టెప్‌-3: ఒకసారి లాగిన్ అయిన తర్వాత ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ట్యాబ్ కింద ‘క్లెయిమ్ (ఫారం-31, 19, 10 సీ & 10డీ)’పై క్లిక్ చేయాలి.
  • స్టెప్‌-4: కొత్త ట్యాబ్ తెరవబడుతుంది. అక్కడ మీరు సరైన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం వెరిఫై క్లిక్ చేయాలి.
  • స్టెప్‌-5: మీ బ్యాంక్ ఖాతా వివరాలు ధ్రువీకరించిన తర్వాత మీరు ఈపీఎఫ్‌ఓ ​​ద్వారా పేర్కొన్న నిబంధనలు, షరతులను నిర్ధారించాల్సి ఉంటుంది.
  • స్టెప్‌-6: ‘ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్’పై క్లిక్ చేయాలి.
  • స్టెప్‌-7: డ్రాప్-డౌన్ మెను నుంచి మీరు మీ ఈపీఎఫ్‌ ఖాతా నుంచి ఉపసంహరణకు దరఖాస్తు చేయడానికి కారణాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు అర్హత ఉన్న ఎంపికలు మాత్రమే కనిపిస్తాయి.

ఆన్‌లైన్‌ క్లెయిమ్‌కు ఇవి తప్పని సరి

సభ్యులు సర్వీసులో చేరిన తేదీ నుంచి నిష్క్రమించిన తేదీ ఈపీఎఫ్‌ఓ ​​డేటాబేస్‌లో అందుబాటులో ఉండాలి. అలాగే సభ్యుడు ప్రస్తుతం పీఎఫ్‌ చట్టం కింద కవర్ చేయదగిన ఏ స్థాపన కింద పని చేయకూడదు. దీంతో పాటు క్లెయిమ్‌ను ఎస్టాబ్లిష్‌మెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత రెండు నెలల ముందు సమర్పించకూడదు. అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సభ్యులు తమ ఈ-కెవైసీ (ఆధార్) ఆధారాలను ఈపీఎఫ్‌ఓకు పంచుకోవడానికి యుఐడీఏఐకి సమ్మతిని ఇస్తూ వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా క్లెయిమ్ సమర్పణను ప్రామాణీకరించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి