AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Passport Rules: పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులకు అలెర్ట్‌.. ఆ నిబంధన మారిందోచ్చ్‌.. తెలుసుకోకపోతే ఇక అంతే..!

తాజాగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సమర్పించేటప్పుడు డిజిలాకర్ ఖాతాను సృష్టించడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రత్యేకించి వారు ధ్రువీకరణ ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఉపయోగిస్తే డిజిలాకర్‌ తప్పనిసరి అవుతుంది. దరఖాస్తుదారులు ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ డిజిలాకర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిలాకర్‌ని ఉపయోగించి అన్ని పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

New Passport Rules: పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులకు అలెర్ట్‌.. ఆ నిబంధన మారిందోచ్చ్‌.. తెలుసుకోకపోతే ఇక అంతే..!
Passport
Nikhil
|

Updated on: Aug 19, 2023 | 8:00 PM

Share

విదేశాలకు వెళ్లాలంటే ప్రతి భారత పౌరుడికి పాస్‌పోర్ట్‌ తప్పనిసరి. పాస్‌పోర్ట్‌ లేకుండా ఇతర దేశాలు వీసాలు మంజూరు చేయవు. అలాగే దేశంలో చాలా చోట్ల పాస్‌పోర్ట్‌ను ధ్రువీకరణ పత్రంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి చాలా మంది భారతీయులు పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు. తాజాగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సమర్పించేటప్పుడు డిజిలాకర్ ఖాతాను సృష్టించడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రత్యేకించి వారు ధ్రువీకరణ ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఉపయోగిస్తే డిజిలాకర్‌ తప్పనిసరి అవుతుంది. దరఖాస్తుదారులు ఇప్పుడు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ డిజిలాకర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిలాకర్‌ని ఉపయోగించి అన్ని పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకని, పాస్‌పోర్ట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించే ముందు దరఖాస్తుదారులు తప్పనిసరిగా డిజిలాకర్‌లో తప్పనిసరిగా పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ తాజా నిబంధన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

హార్డ్ కాపీలు అక్కర్లేదు

దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి దరఖాస్తుదారులు తమ పత్రాలను అప్‌లోడ్ చేయడానికి డిజిలాకర్‌ను ఉపయోగిస్తే దరఖాస్తు ప్రక్రియ సమయంలో వారు ఇకపై ఎటువంటి పత్రాల హార్డ్ కాపీలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది మొత్తం ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు.

దరఖాస్తు ప్రక్రియ వేగవంతం

డిజిలాకర్ పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా సమర్థవంతంగా చేయడానికి కూడా ప్రవేశపెట్టారు. అదే సమయంలో భౌతిక పత్రాల ధ్రువీకరణ అవసరాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

డిజిలాకర్ అంటే?

డిజిలాకర్‌ అంటే డిజిటల్‌ వ్యాలెట్‌. ఇది భారతీయ ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ ప్రారంభించింఇ. దీనితో, వినియోగదారులు ప్రభుత్వం జారీ చేసిన అన్ని అవసరమైన పత్రాలను సురక్షితమైన పద్ధతిలో సేకరించి ఉంచుకోగలరు. డ్రైవింగ్ లైసెన్స్, మార్క్‌షీట్‌లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన డాక్యుమెంట్‌లు వంటి అవసరమైనప్పుడు ఎక్కడైనా వినియోగదారులు దీన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.

ఉపయోగించడం ఇలా?

డిజిలాకర్ ఖాతాను తెరవడానికి వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. ఇది ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. అప్పుడు వారు వారి లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌కోడ్ (ఓటీపీ) వస్తుంది. దాంతో డిజిలాకర్ ఖాతాకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు డిజిలాకర్‌లో వివరాలు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే మీరు ఆధార్‌లో మార్పులు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

నిల్వ చేయగల పత్రాలు ఏమిటి?

డిజిలాకర్‌లో మీరు ఏ రకమైన పత్రాన్ని అయినా నిల్వ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ సులువు అవుతుంది. డిజిలాకర్ ద్వారా ఆధార్ పత్రాలను ఉపయోగించడానికి సంబం‍ధిత మంత్రిత్వ శాఖ ఇప్పుడు అనుమతించింది. డిజిలాకర్‌లో ఏ రకమైన సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్‌ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం