Passport Less Journey: పాస్ పోర్టు లేకుండానే ఆ దేశాల్లో విహారయాత్రకు వెళ్లొచ్చు.. ఏయే దేశాలో చెక్ చేసుకోండి..

కేవలం ఫొటో గుర్తింపు కార్డుతో కొన్ని దేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. 15-65 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు ద్వారా  కొన్ని దేశాలను సందర్శించవచ్చు.

Passport Less Journey: పాస్ పోర్టు లేకుండానే ఆ దేశాల్లో విహారయాత్రకు వెళ్లొచ్చు.. ఏయే దేశాలో చెక్ చేసుకోండి..
Passport
Follow us

|

Updated on: Feb 04, 2023 | 11:54 AM

సాధారణంగా పని ఒత్తిడితో అలసిపోయినప్పుడు సేద తీరడానికి విహార యాత్రలకు వెళ్లాలనుకుంటాం. అనుకున్నదే తడవుగా కొందరు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. అయితే విదేశాల్లో విహారయాత్రలకు వెళ్లాలని మనస్సులో ఉన్నా పాస్ పోర్టు, విసా వంటి ప్రయాణ చికాకుల వల్ల విదేశ విహార యాత్రలు అనే మాట మనస్సులో నుంచి తీసేస్తాం. మీకు తెలియన విషయం ఏంటంటో ప్రపంచంలోని కొన్ని దేశాలకు మనం ఎలాంటి పాస్ పోర్టు లేకుండా వెళ్లవచ్చు. అలాగే అక్కడి సంస్కృతుల గురించి తెలుసుకోవచ్చు. కేవలం ఫొటో గుర్తింపు కార్డుతో కొన్ని దేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. 15-65 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు ద్వారా  కొన్ని దేశాలను సందర్శించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వీసా, పాస్ పోర్టు లేకుండా 58 ప్రాంతాల వద్దకు భారతీయులు విహారయాత్రకు వెళ్లవచ్చు. మాల్దీవ్స్, మారిషస్, థాయిలాండ్, మకావో, శ్రీ లంక, భూటాన్, నేపాల్, కెన్యా, మయన్మార్, ఖతార్, కంబోడియా, ఉగాండా, సీషెల్స్, జింబాబ్వే, వంటి దేశాలకు విహార యాత్రలకు వెళ్లవచ్చు. ముఖ్యంగా మన దేశానికి దగ్గరగా ఉన్న నేపాల్, భూటాన్ దేశాలకు ఎలా వెళ్లాలో? ఓ సారి తెలుసుకుందాం. అలాగే అక్కడి సందర్శించాల్సిన ప్రదేశాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

నేపాల్ ప్రయాణం, సందర్శించాల్సిన ప్రదేశాలు

మీరు వీసా, పాస్ పోర్టు లేకుండా నేపాల్ టూర్ ప్యాకేజీలను తీసుకోవచ్చు. నేపాల్ వెళ్లాలనుకునేవారు భారతదేశంలో అన్ని ప్రధాన విమానాశ్రయాల నుంచి నేపాల్ లోని ఖాట్మాండు విమాన సర్వీసులు ఉన్నాయి. మీకు భారతదేశ ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటే మీరు నేపాల్లో హ్యాపీగా తిరిగేయచ్చు. అలాగే నేపాల్లో తిరగడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖాట్మాండు. ఖాట్మాండు ఓ చారిత్రక, పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ నేపాల్ వైవిద్యభరితమైన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న చిత్వాన్ నేషనల్ పార్క్ వివిధ రకాలైన జంతువులను చూడవచ్చు. కొండప్రాంతాల్లో ట్రేకింగ్ చేయాలనుకుంటే మాత్రం మౌంట్ ఎవరెస్ట్, అన్నపూర్ణ, లాంగ్టాంగ్ ప్రాంతాలకు వెళ్లవచ్చు. ట్రేకింగ్ చేసే వారు నేపాల్ లోని పోకారా ప్రాంతానికి వెళ్లవచ్చు.

భూటాన్ ప్రయాణం, సందర్శించాల్సిన ప్రాంతాలు

భారత ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డుతోనే భూటాన్ లో ప్రయాణించవచ్చు. భూటాన్ సందర్శించాలంటే ఆధార్ లేకపోతే ఓటర్ ఐడీ కార్డ్ తోనైనా సందర్శించే అవకాశం ఉంది. అలాగే పిల్లలై వారి జనన ధ్రువీకరణ పత్రం, లేదా స్కూల్ ఐడీ కార్డును పట్టుకెళ్లవచ్చు.  ఇక్కడ సంప్రదాయంగా వచ్చే భౌద్ధ మత ప్రాంతాలను సందర్శించవచ్చు. భూటాన్ రాజధాని థింపు హిమాలయ పర్వతాల ఎత్తయిన శ్రేణుల్లో చుట్టూ పచ్చదనంతో రైడాక్ నది ప్రకృతి రమణీయతను చూడవచ్చు. అలాగే బోండే లాఖాంగ్, ఖంగ్ కూ లాఖాంగ్, టాగో లాఖాంగ్, డ్రక్ చోడింగ్, నేషనల్ మ్యూజియం వంటి సుందర ప్రాంతాలను భూటాన్ లో చూడవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..