ఇకపై 11 రోజుల్లోనే పాస్‌పోర్టు

పాస్‌పోర్టు కోసం ఇకపై ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో 11రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తామని లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ లోక్‌సభలో వెల్లడించారు. పాస్‌‌పోర్టు పొందేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని కాంగ్రెస్ ఎంపి మనీశ్ తివారీ లోక్‌సభలో లేవనెత్తారు. దానికి స్పందించిన మంత్రి 11 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తామని వెల్లడించారు. పాస్‌పోర్టు జారీలో భాగంగా పోలీస్ వెరిఫికేషన్ కోసం 731 పోలీస్ జిల్లాల్లో యాప్‌ను […]

ఇకపై 11 రోజుల్లోనే పాస్‌పోర్టు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 1:09 PM

పాస్‌పోర్టు కోసం ఇకపై ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో 11రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తామని లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ లోక్‌సభలో వెల్లడించారు. పాస్‌‌పోర్టు పొందేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని కాంగ్రెస్ ఎంపి మనీశ్ తివారీ లోక్‌సభలో లేవనెత్తారు. దానికి స్పందించిన మంత్రి 11 రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తామని వెల్లడించారు. పాస్‌పోర్టు జారీలో భాగంగా పోలీస్ వెరిఫికేషన్ కోసం 731 పోలీస్ జిల్లాల్లో యాప్‌ను ఉపయోగిస్తున్నామని.. దాని ద్వారా సత్వరంగా, అవినీతి లేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.

దేశంలో మొత్తం 36పాస్‌పోర్టు కేంద్రాలు ఉన్నాయని, 93 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అలాగే 412 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటిని నడిపేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు మురళీధరన్ చెప్పుకొచ్చారు.