కస్టమర్లకు మరో షాకిచ్చిన ఎయిర్‌టెల్.. ఈ సారి ఇలా..

గత కొద్దిరోజులు క్రితమే దాదాపు అన్ని టెలికం సంస్థలు.. వినియోగ దారులకు టారీఫ్‌లలో మార్పులు తీసుకొచ్చి.. తీవ్ర ఇబ్బందుకులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సగటు వినియోగ దారుడు అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్‌కు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. అదే సమయంలో మరికొందరు ఇన్‌కమింగ్ కోసం మినిమం టారీఫ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు ఎయిర్‌టెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతూ.. కస్టమర్ల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్లలో మార్పులు చేర్పులు చేసింది. […]

కస్టమర్లకు మరో షాకిచ్చిన ఎయిర్‌టెల్.. ఈ సారి ఇలా..
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 2:15 AM

గత కొద్దిరోజులు క్రితమే దాదాపు అన్ని టెలికం సంస్థలు.. వినియోగ దారులకు టారీఫ్‌లలో మార్పులు తీసుకొచ్చి.. తీవ్ర ఇబ్బందుకులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే సగటు వినియోగ దారుడు అన్‌లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్‌కు అలవాటు పడ్డ సంగతి తెలిసిందే. అదే సమయంలో మరికొందరు ఇన్‌కమింగ్ కోసం మినిమం టారీఫ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు ఎయిర్‌టెల్ దెబ్బ మీద దెబ్బ కొడుతూ.. కస్టమర్ల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్లలో మార్పులు చేర్పులు చేసింది. తాజాగా అన్ లిమిటెడ్ కాలింగ్ టారీఫ్‌లో 84 రోజులు ఉన్న ప్లాన్‌ను 56 రోజులకు కుదించి.. 28 రోజుల వ్యవధిని కట్ చేసింది. ఈ మార్పుచేసి వారం రోజులు కూడా కాలేదు.. అప్పుడే మరో షాకింగ్ న్యూస్ తెలిపింది ఎయిర్ టెల్. ఇక నుంచి మినిమం రీచార్జ్ వ్యాలిడిటీ ప్లాన్‌లో మార్పులు తెచ్చింది. ఇప్పటి వరకు రూ.23 ధరను.. దాదాసే 95 శాతం పెంచేసింది. ఇక ఈ ప్లాన్‌ ధరను రూ.45 చేసింది. అంతేకాదు, పెంచిన ధర ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఎయిర్‌టెల్ కస్టమర్లు ఇక నుంచి రూ.23కు బదులు రూ.45 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెల వినియోగదారుడు రూ.22 అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే గడువు మాత్రం యథావిధిగా 28 రోజులు కొనసాగనుంది.