Airtel: పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్.. వాటి సబ్‌స్ర్కిప్షన్ గడవులో సగానికి పైగా కోత..
ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ ఎయిర్‌టెల్ (Airtel) తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో భాగంగా ఉచితంగా అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Amazon prime) గడువును గుట్టుచప్పుడు కాకుండా తగ్గించింది.
ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ ఎయిర్‌టెల్ (Airtel) తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో భాగంగా ఉచితంగా అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Amazon prime) గడువును గుట్టుచప్పుడు కాకుండా తగ్గించింది. కాగా ఎయిర్‌టెల్ రూ.499, 999, 1199, 1599 ప్లాన్లలో భాగంగా ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుండగా.. ఇకపై కేవలం ఆరు నెలలు మాత్రమే ఆ సదుపాయం ఉండనుంది. ఈ నాలుగు ప్లాన్లపై అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ గడువు కోత ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ తేదీ తర్వాత రీఛార్జి చేసుకున్న వారికి కేవలం ఆరు నెలల గడువే వర్తిస్తుంది. ఏప్రిల్ 1 కంటే ముందు రీఛార్జి చేసుకున్న వారికి మాత్రం ఏడాది సబ్‌స్ర్కిప్షన్ అమలవుతుంది.
కాగా ప్రీపెయిడ్ ప్లాన్లతో పాటు మరికొన్ని బ్రాడ్‌బాండ్ ప్లాన్లపైనా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్ అందిస్తోంది. అయితే వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా గతంతో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ 50 శాతం మేర పెరిగింది. అదేవిధంగా ఏడాది సబ్‌స్ర్కిప్షన్ ఛార్జీలు ఒకప్పుడు రూ.999 ఉండగా.. అది రూ.1499కి చేరింది. కాగా ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మిగిలిన టెలికాం కంపెనీలు సైతం ఇదే బాటలో నడిచే అవకాశముంది.
Also Read: Kieron Pollard: కీరన్ పొలార్డ్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు.. ఆందోళనలో ముంబై ఫ్యాన్స్.. Russia Ukraine War: ఉక్రెయిన్‌పై గర్జిస్తున్న రష్యన్ క్షిపణులు.. మరియుపోల్‌లో ఇరు సేనల వీధి పోరాటాలు..
Yadadri: యాదాద్రిలో శివాలయ పునరుద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు