Project Abhinandan: ప్రాజెక్ట్ అభినందన్ పేరుతో ఎయిర్ ఇండియా సరికొత్త ప్లాన్.. ఇక ఆ సమస్యలకు చెక్
ఎయిర్ ఇండియా ఆన్-గ్రౌండ్ సహాయాన్ని అందించడానికి దేశవ్యాప్తంగా 16 ప్రధాన విమానాశ్రయాలలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సర్వీస్ అస్యూరెన్స్ అధికారులను నియమించిందిది. ఎయిర్ ఇండియా ప్రకారం ఈ అధికారులను నియమించిన విమానాశ్రయాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, కాలికట్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పూణె, వారణాసి మరియు విశాఖపట్నం ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

విమానాశ్రయాల్లో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో ఎయిర్ ఇండియా ‘ప్రాజెక్ట్ అభినందన్’ కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇది బ్యాగేజీ సమస్యతో ఫ్లైట్‌లు మిస్ అయిన వారికి వారికి వ్యక్తిగతీకరించిన, అవాంతరాలు లేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ తాజా ప్లాన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా ఆన్-గ్రౌండ్ సహాయాన్ని అందించడానికి దేశవ్యాప్తంగా 16 ప్రధాన విమానాశ్రయాలలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సర్వీస్ అస్యూరెన్స్ అధికారులను నియమించిందిది. ఎయిర్ ఇండియా ప్రకారం ఈ అధికారులను నియమించిన విమానాశ్రయాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, కాలికట్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పూణె, వారణాసి మరియు విశాఖపట్నం ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రాజెక్ట్ అభినందన్ ప్లాన్ ద్వారా చెక్-ఇన్ ప్రాంతం, లాంజ్‌లు, బోర్డింగ్ గేట్‌ల దగ్గర, రవాణా సమయంలో లేదా అరైవల్ హాల్ వద్ద సహాయం అవసరమైన ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఈ అధికారులు సహాయం అందిస్తారు. దీనికి సంబంధించి ఎయిర్‌ఇండియా 100 మంది అధికారులను విమానాశ్రయాల్లో నియమించింది. తప్పిపోయిన విమానాలు, ఆలస్యమైన సామగ్రి డెలివరీ, విమానాశ్రయాలలో మిస్‌కనెక్షన్‌లు వంటి అనేక ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఈ అధికారులు శిక్షణ పొందారు. ఈ అధికారులు ఇతర ఎయిర్ ఇండియా, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల సిబ్బందితో పాటు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంటారని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్‌పోర్టులోని అనుభవాలు ఎంత తరచుగా ప్రయాణించే వారికైనా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. కాబట్టి ‘ప్రాజెక్ట్ అభినందన్’ తన అతిథులకు విమానాశ్రయ అనుభవాన్ని సులభతరం చేయడానికి, వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చేందకు తీసుకొచ్చామని ఎయిర్‌ఇండియా ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా అహ్మదాబాద్, బెంగళూరు, కాలికట్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, హైదరాబాద్, కొచ్చిలోని 16 కీలక విమానాశ్రయాల్లో బుక్ చేసిన క్యాబిన్ క్లాస్‌తో సంబంధం లేకుండా ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సహాయం చేయడానికి ఈ సర్వీస్ అస్యూరెన్స్ అధికారులు అందుబాటులో ఉంటారని ఎయిర్‌లైన్ తెలిపింది. కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పూణే, వారణాసి, విశాఖపట్నం విమానాశ్రయాల్లో ఈ ఎస్‌ఏఓలు సాధారణ ఎయిర్ ఇండియా ఉద్యోగులు, ఇతర గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీల సిబ్బందితో కలిసి ఉంటారని తెలుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి