AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: వచ్చే ఏడేళ్లలో ఆ రాష్ట్రంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు.. ప్రకటించిన ఆదానీ గ్రూప్‌

ఆదానీ గ్రూపు పెట్టుబడుల దిశగా పరుగులు పెడుతోంది. కొత్త కొత్త రంగాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తూ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలో వచ్చే 7 ఏళ్లలో లక్ష కోట్ల..

Adani Group: వచ్చే ఏడేళ్లలో ఆ రాష్ట్రంలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు.. ప్రకటించిన ఆదానీ గ్రూప్‌
Gautam Adani
Subhash Goud
|

Updated on: Nov 04, 2022 | 7:56 AM

Share

ఆదానీ గ్రూపు పెట్టుబడుల దిశగా పరుగులు పెడుతోంది. కొత్త కొత్త రంగాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తూ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలో వచ్చే 7 ఏళ్లలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు ‘ఇన్వెస్ట్ కర్ణాటక 2022’లో ‘ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్’ సీఈఓ కరణ్ గౌతమ్ అదానీ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తిగా ఉందని ఆయన తెలిపారు.

కర్ణాటకలో ఇప్పటికే 20,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. సిమెంట్, పవర్, గ్యాస్ లైన్, ఎడిబుల్ ఆయిల్, రవాణా, డిజిటల్, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. కర్ణాటకలో అన్ని రంగాల్లోనూ మా పెట్టుబడి విస్తరిస్తోంది. వచ్చే 7 ఏళ్లలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాము. అదానీ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా ఉన్నందున మేము కర్ణాటకలో కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాము అని అదానీ చెప్పారు. కర్ణాటకలో అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 70 లక్షల టన్నులకు పెంచుకుంది. నాలుగు యూనిట్లలో సిమెంట్ ఉత్పత్తి జరుగుతోంది. ఇదే తరహాలో ఇతర రంగాల్లోనూ పెట్టుబడులను విస్తరించాలని కంపెనీ యోచిస్తోందని ఆయన వెల్లడించారు.

‘మంగుళూరు విమానాశ్రయం విస్తరణ’

అదానీ గ్రూప్ ప్రస్తుతం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఎయిర్‌పోర్టు విస్తరణలో ఆదానీ గ్రూప్‌ పాలుపంచుకుంటున్నట్లు సమాచారం. తీర ప్రాంత నగరమైన మంగళూరులో అదానీ గ్రూప్ తన ఉనికిని పెంచుకునేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తోంది. బెంగళూరులో జరుగుతున్న గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల సదస్సులో తొలిరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా డీల్స్ కుదిరాయి. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సును ప్రారంభించారు. కర్ణాటకలో లక్ష కోట్లు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే