Aadhaar Locking: మీ ఆధార్‌ కార్డును లాక్‌ చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..? ఇలా చేయండి

అన్ని డాక్యుమెంట్లలో ఆధార్‌ ముఖ్యమైనది. ఇది లేనిది పనులు జరగవు. బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల వరకు అన్నింటికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అలాగే చిన్న చిన్న..

Aadhaar Locking: మీ ఆధార్‌ కార్డును లాక్‌ చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..? ఇలా చేయండి
Aadhaar Locking
Follow us
Subhash Goud

|

Updated on: Nov 04, 2022 | 8:52 AM

అన్ని డాక్యుమెంట్లలో ఆధార్‌ ముఖ్యమైనది. ఇది లేనిది పనులు జరగవు. బ్యాంకు ఖాతా నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల వరకు అన్నింటికి ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అలాగే చిన్న చిన్న పనులకు కూడా ఆధార్‌ కావాల్సిందే. భారతీయులకు ప్రభుత్వం జారీ చేసే విశిష్ట గుర్తింపు కార్డు ఇది. యూఐడీఏఐ నుంచి జారీ చేసే ఆధార్‌ కార్డు విషయంలో ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్‌లో మార్పులు చేర్పులకు సులభమైన పద్దతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నకిలీ ఆధార్‌ కార్డులు పుట్టుకొస్తున్నాయి. కొందరు ఆధార్‌ కార్డులను నకిలీవి సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆధార్‌ దుర్వినియోగం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ దుర్వినియోగం కాకుండా చెక్‌ పెట్టవచ్చు. అయితే ఆధార్‌ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఆధార్‌ కార్డు వినియోగంలో పలు జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తోంది. ఆధార్‌ కార్డును పబ్లిక్‌ కంప్యూటర్లలో ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్‌ చేయవద్దని హెచ్చరిస్తోంది. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఉన్న కంప్యూటర్లలో డౌన్‌లోడ్‌ చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని హెచ్చరిస్తోంది. ఇందు కోసం ఆధార్‌ కార్డును కూడా లాక్‌ చేసుకోవచ్చు.

ఆధార్‌ కార్డును ఎలా లాక్‌ చేయాలి..?

ఆధార్‌ దుర్వినియోగం కాకుండా సురక్షితంగా ఉంచుకునేందుకు ఆన్‌లైన్‌ విధానంలో లాక్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఎంఆధార్‌ యాప్‌ సహాయంతో ఈ సదుపాయాన్ని పొందవచ్చని చెబుతోంది. ఈ యాప్‌ ద్వారా మీ బయోమెట్రిక్‌ లాక్‌ చేసుకోవచ్చు. దీని కోసం మీకు వర్చువల్‌ ఐడీ అవసరం ఉంటుంది. ఈ ఐడీ 16 అంకెల రివోకేవల్‌ నెంబర్‌ ఉంటుంది. ఈ ఐడి నెంబర్‌ను ఆధార్‌ నెంబర్‌తో పాటు మ్యాచ్‌ చేస్తారు. దీని కోసం ఆధార్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1947పై ఎస్‌ఎంఎస్‌ ద్వారా పొందే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా మీరు మీ ఆధార్‌ కార్డును లాక్‌ చేసుకోవచ్చు. యూఐడీని లాక్‌ చేయడానికి ఆధార్‌లోని చివరి 4 అంకెలు లేదా 8 అంకెలు టైప్‌ చేసి 1947 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయడం ద్వారా కూడా లాక్‌ చేసుకోవచ్చు. ఉదా: GVID స్పేస్‌ 1234. ఒకే వేళ మీరు అన్‌లాక్‌ చేసుకోవాలంటే RVID 1234 టైప్‌ చేసి 1947 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాల్సి ఉంటుంది.

మాస్క్ ఆధార్

మాస్క్‌ ఆధార్‌ అనగానే మీ ఆధార్‌ కార్డును సురక్షితంగా ఉంచడం. ఈ కార్డును అనధికారిక సంస్థలకు ఇవ్వవచ్చు. దీని వల్ల మీ ఆధార్‌ నెంబర్‌ సురక్షితంగా ఉంటుంది. మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగతా అంకెలు కనిపించవు. వాటి స్థానంలో మార్క్స్‌ చేసి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇదే కాకుండా మీ ఆధార్‌ను మరో విధంగా సురక్షితం చేసుకోవచ్చు. ఈమెయిల్‌ ఐడీ లేదా ఫోన్‌ నెంబర్‌తో లింక్‌ చేయడమే. ఈ విధానం ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లోనూ ఆధార్‌ వెరిఫికేషన్‌ చేసుకోవచ్చు. ఆన్ వెరిఫికేషన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్‌ నెంబర్‌ నమోదు చేసి ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఆధార్‌పై క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా కూడా చేసుకునే సౌకర్యం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!