AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank News: పెన్షనర్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ సేవల కోసం ఇకపై బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు..

పెన్షర్ల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త సేవలను తీసుకొచ్చింది. ఇకపై పింఛనను దారులు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే సమర్పించే అవకాశాన్ని క్పలించింది. బ్యాంకుకు వెళ్లలేని సీనియర్‌ సిటీజన్ల కోసం వీడియోకాల్‌ ద్వారా..

Bank News: పెన్షనర్లకు గుడ్‌ న్యూస్‌.. ఆ సేవల కోసం ఇకపై బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు..
Bank Of Baroda
Narender Vaitla
|

Updated on: Nov 04, 2022 | 11:42 AM

Share

పెన్షర్ల కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త సేవలను తీసుకొచ్చింది. ఇకపై పింఛనను దారులు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచే సమర్పించే అవకాశాన్ని క్పలించింది. బ్యాంకుకు వెళ్లలేని సీనియర్‌ సిటీజన్ల కోసం వీడియోకాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే గతేడాది ఎస్‌బీఐ ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలంటే..

* వినియోగదారులు ఇందుకోసం ముందుగా పెన్షన్‌ సార్థి పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం వీడియో బేస్డ్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వత పెన్షన్‌ చెల్లిస్తున్న బ్రాంచీతో రిజిస్టర్‌ చేసుకున్న పీపీఓ నంబరు, ఖాతా నంబరు ఎంటర్‌ చేయాలి.

* రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది.

* తర్వాత అవసరమైన కొన్ని వివరాలను ఇవ్వాలి. అనంతరం వీడియో కాల్ చేసే సమయాన్ని ఎంచుకోవాలి.

* అనంతరం బ్యాంకు అధికారిక వీడియో కాల్ చేయగానే మీ ఫోటో ఐడీ కార్డును బ్యాంకు అధికారికి చూపిస్తే, ఆ అధికారి కార్డును క్యాప్చర్‌ చేస్తారు. ఆ తర్వాత వివరాల నమోదు కోసం పెన్షనర్‌ స్క్రీన్‌పై ప్రశ్నా పత్రం కనిపిస్తుంది.

* ఫొటోలను క్యాప్చర్‌ చేసిన తర్వాత ఆధార్‌ రిజిస్టర్‌ మొబైలన్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని బ్యాంకి అధికారికి చెప్పాలి.

* ఇదంతా పూర్తయిన తర్వాత లైఫ్‌ సర్టిఫికెట్‌ పెన్షన్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ అవుతుంది.

ఆన్ లైన్ లో లైఫ్ సర్టిఫికేట్ ను సబ్ మిట్ చేసే వెసులుబాటును ఇప్పటికే ఎస్బీఐ సహా మరికొన్ని బ్యాంకులు అందులోకి తీసుకొచ్చాయి. మీరు మీ బ్యాంకర్లను సంప్రదించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి