Wealth Tax: అంబానీ, అదానీలపై అదనపు పన్ను.. ఓకే అన్న 74శాతం మంది పౌరులు.. పూర్తి వివరాలు ఇవి..
ఎర్త్4ఆల్, గ్లోబర్ కామన్స్ అలయన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. దేశంలోని ఆదాయ అసమానతలు, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కోటీశ్వరులపై సంపద పన్ను విధించాలని 74శాతం భారతీయులు అభిప్రాయపడ్డారని ఆ సర్వే నివేదిక స్పష్టం చేసింది. అంటే మన దేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ సంపద పన్ను అంశాన్ని సమర్థిస్తున్నట్లు లెక్క.

ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు.. పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే మిగిలపోతున్నాడు. పేద, ధనిక మధ్య అంతరం తగ్గడం లేదు సరికదా.. మరింత పెరిగిపోతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా.. మన దేశంలో మరింత అధికంగా ఉంది. ఈ అసమానతలను తగ్గించేందుకు అత్యంత సంపన్నులపై సంపద పన్ను విధించాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తూనే ఉంది. మన దేశంలో అయితే మరింత గట్టిగా వినిపిస్తోందని ఓ సర్వే వెల్లడించింది. అత్యంత ధనిక వర్గంపై అదనపు పన్ను సూపర్ రిచ్ ట్యాక్స్ లేదా సంపద పన్నును విధించాలని చాలా మంది భారత పౌరులు కోరుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంపద పన్ను అంటే ఏమిటి? దీని పరిధిలోకి వచ్చే వారు ఎవరు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సర్వే ఇలా..
ఎర్త్4ఆల్, గ్లోబర్ కామన్స్ అలయన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. దేశంలోని ఆదాయ అసమానతలు, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కోటీశ్వరులపై సంపద పన్ను విధించాలని 74శాతం భారతీయులు అభిప్రాయపడ్డారని ఆ సర్వే నివేదిక స్పష్టం చేసింది. అంటే మన దేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ సంపద పన్ను అంశాన్ని సమర్థిస్తున్నట్లు లెక్క.
జీ20 దేశాల సదస్సులో ప్రతిపాదన..
ఈ సంపద పన్ను అంశాన్ని ఈ ఏడాది బ్రెజిల్లో జరగనున్న జీ20 దేశాల సమావేశాల్లో ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు ఆయా దేశాల్లో దీనికి 68శాతం మంది మద్దతు పలికారు. మన దేశంలో మాత్రం ఏకంగా 74శాతం మంది మద్దతునిచ్చారు. వచ్చే నెలలోబ్రెజిల్ దేశంలో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు దీనిపై చర్చించనున్నారు. అనంతరం వారి నుంచి ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీ20 దేశాల్లో ఈ వెల్త్ ట్యాక్స్(సంపద పన్ను) విధింపుపై సర్వే చేశారు. దాదాపు 22వేల సామాన్య పౌరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. మన భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక అసమానతలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. దీంతో సంపద పన్ను ప్రతిపాదన 2013 నుంచే చర్చలో ఉంది. ఏటా దీనికి మద్దతు పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తర్వాత దీనికి మరింత డిమాండ్ పెరిగింది.
ఆ డబ్బును దేనికి వినియోగించాలి..
సంపన్నులపై సంపద పన్ను విధిస్తారు సరే.. మరి ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తారు? ఇదే ప్రశ్నను సర్వేలో సైతం అడిగారు. దీనికి మన భారతీయులు ఇచ్చిన సమాధానాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. ఆ పన్నుతో వచ్చే ఆదాయాన్ని వాతావరణ మార్పులు, ప్రకృతి సంరక్షణకు ఉపయోగించాలని ఆకాంక్షించారు. అలాగే కార్బన్ ఉద్ఘారాలా నివారణకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు కేటాయించాలని 74శాతం మంది, మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం కేటాయించాలని 76శాతం మంది, పవర్ జనరేషన్, ట్రాన్స్ పోర్టు, నిర్మాణం, పరిశ్రమల వంటి రంగాల్లో మార్పుల కోసం కేటాయించాలని 68శాతం మంది అభిప్రాయపడ్డారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




