AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iPhone 11: ఫ్లిప్‪కార్ట్‪కి భారీ జరిమానా! ఆ విద్యార్థి అనుకున్నది సాధించాడు.. అసలేం జరిగిందంటే..

ఓ విద్యార్థికి ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 11 బుక్ చేస్తే.. నిర్మా సబ్బు వచ్చింది. రీఫండ్ చేయాలని కోరినా.. ఫ్లిప్ కార్ట్ పట్టించుకోకపోవడంతో ఆ విద్యార్థి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టుకు ఫ్లిప్ కార్ట్ కు మొట్టికాయలు వేసి, భారీ జరిమానా విధించింది.

Apple iPhone 11: ఫ్లిప్‪కార్ట్‪కి భారీ జరిమానా! ఆ విద్యార్థి అనుకున్నది సాధించాడు.. అసలేం జరిగిందంటే..
Iphone11
Madhu
|

Updated on: Mar 26, 2023 | 2:30 PM

Share

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా డిటర్జెంట్ సబ్బును డెలివరీ చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలా మంది కస్టమర్లు తప్పుగా వచ్చిగా వస్తువును రిటర్న్ చేసి, రీఫండ్ తీసుకుంటూ ఉంటారు. ఎవరూ కోర్టుల వరకూ ఈ విషయాన్ని తీసుకువెళ్లరు. అయితే కొప్పల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాపిల్ ఐఫోన్ 11ని ఆర్డర్ చేసి, ఫోన్‌కు బదులుగా సబ్బు రావడంతో కోర్టుకు వెళ్లాడు. కోర్టులో ఫ్లిప్ కార్ట్ ని దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం..

అసలు ఏం జరిగిందంటే..

హర్ష అనే విద్యార్థి ఫ్లిప్‌కార్ట్‌కు రూ. 48,999 చెల్లించి ఐఫోన్ 11ని బుక్ చేసుకున్నాడు, అయితే అతనికి 140 గ్రాముల నిర్మా డిటర్జెంట్ సోప్‌తో పాటు కాంపాక్ట్ కీప్యాడ్ ఫోన్ కూడా వచ్చింది. వినియోగదారుడు కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా, సమస్య పరిష్కారమవుతుందని, ఆ మొత్తాన్ని కూడా వాపసు చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ సమస్యను పరిష్కరించలేదు. అతనికి డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. దీంతో ఆ విద్యార్థి కోర్టును ఆశ్రయించారు.

గత ఏడాది జూలైలో ఫ్లిప్‌కార్ట్ మేనేజింగ్ డైరెక్టర్, థర్డ్ పార్టీ విక్రేత అయిన సేన్ రిటైల్స్ మేనేజర్‌పై కేసు పెట్టారు. ఇది కేవలం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ మాత్రమేనని, ఇది కస్టమర్‌లు, విక్రేతలు ఉత్పత్తులను మార్పిడి చేసుకోవడానికి సహాయపడుతుందని.. జరిగిన తప్పు తన వల్ల జరిగింది కాదని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే కోర్టు వారి వాదనతో ఏకీభవించలేదు. ఇలా ఆన్‌లైన్ వ్యాపారాన్ని నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని కోర్టు పేర్కొంది. కంపెనీ సేవలో లోపం కిందకు వస్తుందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

భారీగా పెనాల్టీ..

దీంతో ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 11 కోసం ఆ విద్యార్థి వెచ్చించిన రూ. 48,999 రీఫండ్ చేయాలని కోర్టు ఆదేశించింది. అంతకాక కంపెనీ సేవలో లోపం, అన్యాయమైన వాణిజ్య విధానాల కారణంగా అదనంగా రూ. 10,000 జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. అలాగే ఆ విద్యార్థికి మానసిక వేదన కలిగించినందుకు, కోర్టు ఖర్చులకు మరో రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది. మొత్తం మీద కంపెనీ ఓ ఆర్డర్ ను తప్పుగా ఇచ్చినందుకు మొత్తం రూ.73,999 ఖర్చు చేయాల్సి వచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..