SBI mutual fund: ఎస్బీఐ నుంచి కొత్త మ్యూచువల్ ఫండ్.. కనీస పెట్టుబడి ఎంతో తెలుసా..?
ప్రజలకు అత్యంత నమ్మకమైన పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లదే మొదటి స్థానం. వివిధ బ్యాంకులు అమలు చేసే ఈ పథకాలలో సాధారణ ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్లు ఎక్కువగా పెట్టుబడి పెడతారు. రిస్క్ లేకుండా రాబడి అందించే ఎఫ్ డీలకు ప్రజల ఆదరణ చాలా బాగుంటుంది.
ఇటీవల ఎఫ్ డీలకు పోటీగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెరుగుతున్నాయి. కొంచెం రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉండడంతో ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాన్నితీసుకువచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని అనుబంధ సంస్థ అయిన ఎస్ బీఐ మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దానిపేరే ఎస్ బీఐ క్యాండ్ ఫండ్ డైరెక్ట్. ఈ ఫండ్ సబ్ స్క్రిప్షన్ డిసెంబర్ నాలుగు నుంచి మొదలైంది. ఈ నెల 18 వరకూ పెట్టుబడిదారులకు అవకాశం ఉంటుంది. ఈ ఫండ్ లో కనీస పెట్టుబడిని రూ.5 వేలుగా నిర్ధారణ చేశారు. గరిష్టంగా ఎంతయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి పరిమితి లేదు. అలాగే దీనిలో ఎంట్రీ లోడ్ అంటూ ఏమీ ఉండదు. ఎగ్జిట్ లోడ్ మాత్రం ఆరు నెలల్లోపు ఫండ్ ను వెనక్కి తీసుకుంటే 0.5 శాతంగా వసూలు చేస్తారు.
స్టాక్ మార్కెట్ పై ప్రజలకు ఇటీవల కాలంలో అవగాహన బాగా పెరిగింది. వివిధ కంపెనీల షేర్లు, వాటాలు కొనడం, అమ్మడం, ఐపీవో తదితర వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. షేర్లను డైరెక్టుగా కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలాగే తన తరఫున షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్ట మ్యూచువల్ ఫండ్స్ లు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. వాటి మేనేజర్లు షేర్ మార్కెట్ కు క్షుణ్ణంగా పరిశీలించి, లాభదాయకమైన వాటిలో మన డబ్బులను పెట్టుబడి పెడతారు. కొత్తగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుంటాయి. మార్కెట్ లావాదేవీలపై పూర్తి అవగాహన కల్పిస్తాయి.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకువచ్చిన క్యాంట్ ఫండ్ డైరెక్ట్ అనేది ఈక్విటీ కి చెందిన పెట్టుబడి మార్గం. మార్కెట్ లో రిస్కులను ఈ ఫండ్ సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. దీర్ఘకాలంలో పెట్టుబడికి అధిక రాబడి తీసుకురావడమే ఈ ఫండ్ ప్రధాన ఉద్దేశం. కనీస పెట్టుబడిగా కేవలం రూ.5 వేలు ఉంటే సరిపోతుంది. ఈ స్కీమ్ బెంచ్ మార్కు ఇండెక్స్ నిఫ్టీ 200 టీఆర్ఐగా ఉంది. ఈక్విటీలు, ఈక్విటీ సంబంధిత మార్గాలలో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. క్వాటిటేటివ్ మోడల్ వ్యూహం ద్వారా పెట్టుబడుల పోర్టుపోలియోను ప్లాన్ చేసుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి