AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2000 Rupee Notes: కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు ఎక్కడికి పోయాయి? పార్లమెంట్‌లో మంత్రి సమాధానం!

2000 Rupee Notes: 2000 రూపాయల నోట్లు చెలామణి నుంచి ఉపసంహరించుకుని ఏడాది గడిచినప్పటికీ వాటి గురించి ఇంకా అప్‌డేట్లు వస్తూనే ఉన్నాయి. పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఆ నోట్లు బ్యాంకులకు వస్తూనే ఉన్నాయి. ఈ నోట్లకు సంబంధించి కేంద్ర సహాయ మంత్రి పార్లమెంట్‌లో కీలక అప్‌డేట్‌ అందించారు..

2000 Rupee Notes: కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు ఎక్కడికి పోయాయి? పార్లమెంట్‌లో మంత్రి సమాధానం!
Subhash Goud
|

Updated on: Dec 04, 2024 | 4:36 PM

Share

దేశంలో రూ.2000 నోట్లను నిషేధించి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటికీ మార్కెట్‌లో 3 కోట్ల 46 లక్షల నోట్లు ఉన్నాయి. అంటే రూ.2000 నోట్లను రద్దు చేసినప్పటికీ మార్కెట్‌లో చెలామణిలో ఉన్న నోట్లన్నీ తిరిగి రాలేదు. పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈ సమాచారం ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2016లో రూ.2000 డినామినేషన్ నోట్లను విడుదల చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

ఇది కూడా చదవండి: Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? అయితే ఇలా ఆపేయండి!

31 మార్చి 2017 నాటికి, 32,850 లక్షల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. మార్చి 31, 2018 నాటికి 33,632 లక్షల బ్యాంకు నోట్లు చలామణిలోకి వచ్చాయి. మే 19, 2023న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్కెట్ నుండి రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, రూ.2000 విలువ కలిగిన 17,793 లక్షల బ్యాంక్ నోట్లు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి. ఆర్బీఐ ప్రకటన తర్వాత 15 నవంబర్ 2024 వరకు 17,447 లక్షల బ్యాంకు నోట్లు తిరిగి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

చాలా నోట్లు ఇప్పటికీ మార్కెట్‌లో..

ఈ నేపథ్యంలో 15 నవంబర్ 2024 వరకు 3 కోట్ల 46 లక్షల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ మార్కెట్లో ఉన్నాయి. ఇంకా రూ.2000 నోట్లు ఉన్నవారికి రూ.2000 బ్యాంకు నోట్లను మార్చుకునే, డిపాజిట్ చేసే సదుపాయం ఇంకా కొనసాగుతోందని, ఆర్‌బిఐకి చెందిన 19 కార్యాలయాల్లో ఈ పని చేయవచ్చని ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.

నోట్లను ఇలా మార్చుకోవచ్చు

తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకోవాలనుకునే వారు రూ.2000 నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌కు చెందిన 19 కార్యాలయాలలో దేనికైనా పంపవచ్చు. బ్యాంకు నోట్‌ను స్వీకరించిన తర్వాత, పంపిన వారి ఖాతాలో డబ్బు జమ చేయబడుతుంది.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!