CNG Cars: ఆ కార్లకు యమా డిమాండ్.. ఈవీ కార్ల కంటే తోపు అంటున్న కస్టమర్లు
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)తో నడిచే వాహనాలు కాలక్రమేణా జనాదరణ పొందాయి. గ్లోబల్ వార్మింగ్ గురించి పెరుగుతున్న అవగాహన వల్ల పెట్రోలు, డీజిల్ కార్ల వల్ల కలిగే ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వాలు వివిధ కార్లపై సబ్సిడీలను మంజూరు చేస్తున్నాయి.
ఇప్పటికే ఈవీ కార్లు ప్రజాదరణ పొందినా సీఎన్‌జీ కార్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. సీఎన్‌జీ అనేది ఐసీఈ-శక్తితో నడిచే వాహనాలలో మరింత పర్యావరణ అనుకూలమైన ఎంపిక. అయితే సీఎన్‌జీ కార్లు పెట్రోల్ కార్లల్లా సులభంగా అందుబాటులో లేవు. భారతీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో కొన్ని ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ పెట్రోల్, డీజిల్ కార్ల మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.
ఉద్గారాలు, మైలేజ్, ఇంజిన్ జీవితకాలం
తక్కువ ఉద్గారాల విడుదలతో పాటు మెరుగైన మైలేజీ సీఎన్‌జీ వాహనాలను యూజర్లకు మరింత చేరువ చేస్తున్నాయి. ఇది మార్కెట్లో అత్యంత పరిశుభ్రమైన శిలాజ ఇంధనం, పెట్రోల్ లేదా డీజిల్ వంటి ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల కంటే చౌకగా వస్తుంది. సగటున పెట్రోల్ కార్ల కంటే సమానమైన ఇంధనంతో సీఎన్‌జీతో నడిచే కార్లు 25 శాతం ఎక్కువ దూరం ప్రయాణించగలవు. క్లీనర్ బర్నింగ్ ఇంధనం కారణంగా పెట్రోల్ కార్లతో పోల్చినప్పుడు సీఎన్‌జీ కార్లు ఎక్కువ ఇంజన్ జీవితకాలాన్ని అందిస్తాయి. దీని వల్ల ఇంజన్ తక్కువ అరిగిపోతుంది.
నిర్వహణ
పెట్రోలు ఇంజన్లు సాధారణంగా సీఎన్‌జీ ఇంజిన్ల కంటే తక్కువ ఖర్చుతో ఉంటాయి. సీఎన్‌జీ ఇంజన్లు ఉన్న కార్లను రిపేర్ చేయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం. సీఎన్‌జీ ట్యాంకులు అదనంగా తనిఖీ చేయాలి. అందువల్ల సీఎన్‌జీ కార్లకు నిర్వహణ సమస్యలు ఎక్కువ. పెట్రోల్ కార్ల నిర్వహణకు మెకానిక్‌లు ప్రతిచోటా అందుబాటులో ఉంటారు. అయితే సీఎన్‌జీ మెకానిక్‌లు అంతలా ఉండదు. అందువల్ల నిర్వహణ అనేది భారం అవుతుంది.
పనితీరు, లభ్యత
పెట్రోల్ కార్లు సాధారణంగా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో విస్తృత లభ్యతను కలిగి ఉంటాయి. ముఖ్యంగా విడి భాగాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. నిర్వహణ, రిపేర్ షాపులు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అలాగే సీఎన్‌జీ కార్లు పెట్రోల్ కార్లల్లా సులభంగా అందుబాటులో లేవు. అయితే సీఎన్‌జీ కిట్లను ఫ్యాక్టరీ నుంచి నేరుగా తమ కొత్త కారులో సీఎన్‌జీ కిట్లు ఇన్‌స్టాల్ చేసుకునేలా కస్టమర్లు ఎంచుకోవచ్చు. ఆఫ్టర్మార్కెట్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి ఫ్యాక్టరీలో అమర్చిన వాటికి సమానమైన భద్రతకు హామీ ఇవ్వవు.
ప్రాక్టికాలిటీ
కారులో సీఎన్‌జీ కిట్‌ను అమర్చడానికి కస్టమర్ అందుబాటులో ఉన్న బూట్ స్పేస్లో ఎక్కువ భాగాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ఇంధనం నింపే స్టేషన్ల పరిమిత లభ్యత వల్ల ఆచరణకు మరింత ఆటంకం ఏర్పడింది. అత్యధిక సంఖ్యలో సీఎన్‌జీ స్టేషన్లు ఉన్న రాష్ట్రాలు అత్యధిక వాహన సాంద్రత, క్లీనర్ ఇంధన ఎంపికలకు బలమైన ప్రభుత్వ మద్దతును కలిగి ఉంటాయి. అదే సమయంలో భారతదేశంలో సీఎన్‌జీ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రస్తుతం వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి