GST Notice: వెలుగులోకి నయా మోసం.. నకిలీ జీఎస్‌టీ నోటీసులతో కొల్లగొట్టేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల కాలంలో నకిలీ జీఎస్టీ నోటీసుల ద్వారా మోసపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మోసగాళ్లు నకిలీ జీఎస్టీ సమన్లు జారీ చేయడంపై గత వారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జీఎస్టీ అధికారుల నుంచి అందిన ఏదైనా కమ్యూనికేన్‌కు సంబంధించి ప్రామాణికతను ధ్రువీకరించాలని సూచించారు.
భారతదేశంలో పన్ను చెల్లింపుల విషయంలో జీఎస్టీ అనేది కీలకపాత్రం పోషిస్తుంది. అయితే ఇటీవల కాలంలో నకిలీ జీఎస్టీ నోటీసుల ద్వారా మోసపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. మోసగాళ్లు నకిలీ జీఎస్టీ సమన్లు జారీ చేయడంపై గత వారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జీఎస్టీ అధికారుల నుంచి అందిన ఏదైనా కమ్యూనికేన్‌కు సంబంధించి ప్రామాణికతను ధ్రువీకరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో నకిలీ జీఎస్టీ నోటీసుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
నకిలీ జీఎస్టీ సమన్లు
మోసపూరిత ఉద్దేశ్యంతో కొందరు వ్యక్తులు డీజీజీఐ విచారణలో ఉండని లేదా పన్ను చెల్లింపుదారులకు నకిలీ సమన్లు సృష్టించి పంపుతున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీా ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) ఇటీవల గమనించినట్లు సీబీఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నకిలీ సమన్లు నిజమైనవిగా అనిపించవచేలా మోసగాళ్లు జాగ్రత్తలు తీసకుంటునారు. ముఖ్యంగా వాటి డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఉంటుంది. కానీ ఈ సంస్థల విషయంలో ఈ డీఐఎన్ నంబర్‌లు డీజీజీఐ అయిన నంబర్లు కావని అధికారులు వివరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి నకిలీ, మోసపూరిత సమన్లు సృష్టించి పంపడంలో పాల్గొన్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఫిర్యాదు చేయడం ద్వారా డీజీజీఐ తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు వివరిస్తున్నారు.
జీఎస్టీ సమన్లున ధ్రువీకరించడం ఇలా
జీఎస్టీ నోటీసులకు ప్రతిస్పందించే ముందు ఎల్లప్పుడూ జీెస్టీ సమన్లకు సంబంధించిన ప్రామాణికతను ధ్రువీకరించాలి. స్కామర్లు కొన్నిసార్లు పన్ను చెల్లింపుదారులను మోసం చేయడానికి నకిలీ సమన్లను ఉపయోగిస్తారు. పన్ను చెల్లింపుదారులు సీబీఐసీ వెబ్‌సైట్‌లోని ‘వైరిఫై సీబీఐసీ-డీఐఎన్’ విండో లేదా డైరెక్టరేట్ ఆఫ్ డేటా మేనేజ్‌మెంట్ (డీడీఎం) ఆన్‌లైన్ పోర్టల్‌లోని డీఐఎన్ యుటిలిటీ సెర్చ్ ద్వారా డిపార్ట్‌మెంట్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్‌కు సంబంధించిన వాస్తవికతను ధ్రువీకరించవచ్చని సీబీఐసీ తెలిపింది.
నకిలీ సమన్లను నివేదించడం ఇలా
అనుమానాస్పదంగా లేదా బహుశా నకిలీగా అనిపించే డీజీజీఐ/సీబీఐసీ ఫార్మేషన్‌ల నుంచి సమన్లు పొందిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వెంటనే వాటిని సంబంధిత అధికార డీజీజీఐ/ సీబీఐసీ కార్యాలయానికి కూడా ధ్రువీకరణ కోసం నివేదించవచ్చు. తద్వారా ఈ మోసపూరిత కార్యకలాపాలకు బాధ్యులైన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవచ్చని సీబీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి