AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Technology: మరింత ఆలస్యం కానున్న 5జీ సాంకేతికత .. వేలం ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా రాని స్పష్టత..

దేశంలో 5జీ నిరీక్షణ తప్పేలా లేదు. విధానాలు, పరికరాలు, చైనీస్ విక్రేతలు, ఆపై స్పెక్ట్రమ్ ధరలు 5Gని మరింత ఆలస్యం చేస్తున్నాయి...

5G Technology: మరింత ఆలస్యం కానున్న 5జీ సాంకేతికత .. వేలం ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా రాని స్పష్టత..
5g
Srinivas Chekkilla
|

Updated on: Jun 15, 2022 | 8:19 AM

Share

దేశంలో 5జీ నిరీక్షణ తప్పేలా లేదు. విధానాలు, పరికరాలు, చైనీస్ విక్రేతలు, ఆపై స్పెక్ట్రమ్ ధరలు 5Gని మరింత ఆలస్యం చేస్తున్నాయి. మరోవైపు తమ ఫోన్లలో 5జీ బెల్ ఎప్పుడు మోగుతుందా అని యావత్ దేశం చూస్తోంది. బఫరింగ్ లేకుండా వీడియోలను చూడటం ఎప్పుడు చూస్తామో అనుకుంటుంది. జూలైలో స్పెక్ట్రమ్ వేలం వేస్తారని ఆగస్టులో 5జీ లాంఛనంగా ప్రారంభిస్తారని ముందుగా ఊహించారు. కానీ ఇది ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. 5జీ స్పెక్ట్రమ్‌పై కొత్త రచ్చ మొదలైంది. 5G నెట్‌వర్క్‌కు సంబంధించి బ్రాడ్‌బ్యాంక్ ఇండియా ఫోరమ్ అంటే BIF, Amazon India, Meta, TCS, L&T వంటి కంపెనీల సర్వీస్ ప్రొవైడర్ల మధ్య వివాదం ఉంది. BIFలో పాలుపంచుకున్న కంపెనీలు, ప్రభుత్వం ప్రపంచంలోని తరహాలో భారతదేశంలో నేరుగా స్పెక్ట్రమ్ ఇవ్వాలని, దానిపై అతితక్కువ అడ్మినిస్ట్రేటివ్ ఫీజులను తీసుకోవాలని కోరుతున్నాయి. పబ్లిక్ నెట్‌వర్క్‌లతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని కూడా ఈ కంపెనీలు పేర్కొంటున్నాయి.

అంతే కాదు వాటి ద్వారా ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం వస్తుంది. దీనికి విరుద్ధంగా, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (COAI), టెలికాం ఆపరేటర్ల సంస్థ, ఈ ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్ క్యాప్టివ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించినట్లయితే, టెలికాం ఆపరేటర్లు వ్యాపారం చేయడం అనవసరమని స్పష్టంగా పేర్కొంది. బ్యాక్ డోర్ ద్వారా టెలికాం వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ఈ కంపెనీలను అనుమతించరాదని COAI చెబుతోంది. దీనిపై టెక్ కంపెనీలు స్పందిస్తూ, 5G నెట్‌వర్క్‌ను పొందడం వల్ల టెలికాం ఆపరేటర్లకు ఆదాయాన్ని కోల్పోతారనే సిద్ధాంతం నకిలీదని పేర్కొంది. స్పెక్ట్రమ్‌ను ప్రైవేట్‌ కంపెనీలకు ప్రత్యేకంగా కేటాయించాలని ట్రాయ్‌ కోరింది. కానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం అంటే DoT దానిని తిరస్కరించింది. ప్రైవేట్ సంస్థలు టెలికాం ఆపరేటర్ల నుంచి స్పెక్ట్రమ్‌ను లీజుకు తీసుకోవాలని DoT విశ్వసిస్తోంది. అయితే దీనిపై మంత్రివర్గంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం DoT వాదనను తోసిపుచ్చుతుందని, తమకు విడిగా స్పెక్ట్రమ్ కేటాయింపుపై మాత్రమే ముద్ర పడుతుందని BIF భావిస్తోంది.