Modi Cabinet: ఏపీ, తెలంగాణకు కొత్త స్మార్ట్ సిటీలు.. కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ) కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌తో పాటు బీహార్‌లోని గయా జిల్లా కూడా ఈ ప్రాజెక్టులో చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా..
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ) కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌తో పాటు బీహార్‌లోని గయా జిల్లా కూడా ఈ ప్రాజెక్టులో చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం రూ.28,602 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
అయితే ఈ కారిడార్లను ఏపీలోని ఓర్వకల్లు-కొప్పర్తి, తెలంగాణలోని జహీరాబాద్, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్-పాలి, ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని దిఘి, కేరళలోని పాలక్కడ్, యూపీలోని ఆగ్రా-ప్రయాగ్‌రాజ్, బిహార్‌లోని గయలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్ల ఏర్పాటుతో 10 లక్షల మందికి నేరుగా ఉద్యోగాల కల్పన లభించనున్నట్లు, అలాగే మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని మంత్రి తెలిపారు. ఈ కారిడార్లు దాదాపు రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయన్నారు. కేబినెట్‌లో తెలంగాణకు స్మార్ట్‌సిటీని ఏర్పాటు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
కొప్పర్తి హబ్
ఇక కడప జిల్లా కొప్పర్తి లో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామని, దీని కోసం రూ.2,137కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ హబ్ ఏర్పాటు వల్ల సుమారు 54 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటుకు రూ.2,786కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇంఉలో భాగంగా 45వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి