Budget 2021: ఖరీదైనవిగా మారనున్న సెల్‌ఫోన్లు.. పరికరాలపై మినహాయింపులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం

సెల్‌ఫోన్‌ ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెన్‌ను..

Budget 2021: ఖరీదైనవిగా మారనున్న సెల్‌ఫోన్లు.. పరికరాలపై మినహాయింపులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2021 | 3:58 PM

Budget 2021 – Mobile Phones:సెల్‌ఫోన్‌ ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో టెక్నాలజీ రంగంలో అతి ముఖ్యమైనటువంటి మొబైల్ ఫోన్లు, వాటి పరికరాలు, ఛార్జర్‌లపై కస్టమ్ డ్యూటీని 2.5 శాతం పెంచారు. దీంతో వాటి ధరలు పెరిగే అవకాశముంది. ఈమేరకు 400 ఎలక్ట్రానిక్‌ పాత ఉత్పత్తులపై ఉన్న మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు నిర్మలా తెలిపారు. దీని ద్వారా సెల్‌ఫోన్‌లు, వాటి భాగాలు, ఛార్జర్ల ధరలు 5 నుంచి 10శాతం మేర పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: