Metro Neo:మెట్రోలైట్ స్థానంలో చౌకైన ‘మెట్రో నియో’.. మొదటిసారిగా ఢిల్లీలో పరుగులు.. ఎలా ఉంటుందంటే..?

Budget 2021 for Buses in Telugu ప్రధాన నగరాల్లో మెట్రోలైట్‌ వ్యవస్థతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా వ్యవస్థను మెరుగుపరచనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో మెట్రో నియో కారిడార్‌ ఏర్పాటయ్యే

Metro Neo:మెట్రోలైట్ స్థానంలో చౌకైన 'మెట్రో నియో'.. మొదటిసారిగా ఢిల్లీలో పరుగులు.. ఎలా ఉంటుందంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 01, 2021 | 2:12 PM

Light Metro – Neo Metro : మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కోసం రూ.18 వేల కోట్లతో ప్రత్యేక పథకం ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆమె 2021-22 ఆర్థిక బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రధాన నగరాల్లో మెట్రోలైట్‌ వ్యవస్థతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా వ్యవస్థను మెరుగుపరచనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో మెట్రో నియో కారిడార్‌ ఏర్పాటయ్యే ప్రధాన నగరాల్లో ఢిల్లీ తొలిస్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో లైట్, మెట్రో నియో గురించి ఒకసారి తెలుసుకుందాం..

ఖర్చు తక్కువే.. ఇది రైల్-గైడెడ్ పట్టణ రవాణా వ్యవస్థ. మెట్రో నియో పట్టాలమీద కాకుండా.. రోడ్డుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గంలో టైర్లతో.. అత్యాధునిక ఎలక్ట్రిక్ కోచ్‌లతో ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది. సాధరణంగా మెట్రోతో పోలిస్తే ఇది లైట్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌తో దీనికి 20-25% మేర మాత్రమే ఖర్చవుతుంది. అంతేకాకుండా నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే.

మొదటగా ఢిల్లీలో పరుగులు.. ఢిల్లీలోని ద్వారకా సమీపంలోని కీర్తి నగర్ నుంచి బామ్నోలి మధ్యన 19 కిలోమీటర్ల మేర మెట్రో నియో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో నియో మెట్రో ద్వారా సాధారణ మెట్రో స్టేషన్లకు (బ్లూ, గ్రీన్‌ లైన్లకు) అనుసంధానం చేస్తారు. ఇక్కడ గతేడాదే మెట్రోలైట్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనిపై డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి.. కోచ్‌లను తయారుచేయడానికి టెండర్లకు సిద్ధమైంది.

మూడు కోచ్‌లే.. సాధారణంగా మెట్రో రైళ్లకు 6 కోచ్‌ లు ఉంటాయి. మెట్రో నియో సిస్టంలో మూడు-కోచ్‌లు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కటి 12 మీటర్ల పొడవు.. 2.5 మీటర్ల వెడల్పుతో.. ఆరున్నర అడుగుల ఎత్తులో స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియంతో తయారవుతాయి. ఈ బోగీలు చిన్నవిగా ఉండటమే కాకుండా ఢిల్లీ మెట్రో బోగిల కన్నా తేలికైనవి. సాధారణంగా మెట్రో బోగీ 17 టన్నుల మేర ఉంటుంది. ఇది కేవలం 10 టన్నులు మాత్రమే ఉండనుంది.

రబ్బరు-టైర్లతో పరుగులు.. ఈ మెట్రో నియో రబ్బరు-టైర్ల ద్వారా రోడ్ స్లాబ్‌లపై పరుగులు తీస్తాయి. ఆ మార్గంలో ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. దీనికోసం ఫెన్సింగ్ లేదా ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. యాంటీ-కొలిక్షన్ ఫీచర్ తోపాటు వేగ పరిమితి కోసం ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది. దీనికోసం ముఖ్యంగా స్టేషన్లు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లు, ఎక్స్-రే బ్యాగేజ్ స్క్రీనింగ్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, ఢిల్లీ మెట్రోతో అనుసంధానం, మెట్రో నియో ప్లాట్‌ఫాంలు, ఓపెన్ ప్లాట్‌ఫాం, వాహనాల మళ్లీంపు కోసం చర్యలు, అత్యధునిక హంగులతో మౌలిక వసతులు ఉంటాయి.

Also Read: