AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021-22: ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక శరాఘాతం.. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్..

బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక శరాఘాతం అని సంచలన కామెంట్స్ చేశారు. 

Budget 2021-22: ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక శరాఘాతం.. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ రియాక్షన్..
Ram Naramaneni
|

Updated on: Feb 01, 2021 | 2:11 PM

Share

Budget 2021-22:  బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత  విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇదొక శరాఘాతం అని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ కనిపిస్తోందని చెప్పారు. ఎక్కడైతే ఎన్నికలున్నాయో ఆ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు జరిపారని చెప్పుకొచ్చారు. మెట్రో రైల్ విషయంలో కొచ్చి, చెన్నై, బెంగళూరు ఇలా అన్ని చోట్లా ఇచ్చారు తప్ప ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆత్మ నిర్భరత కనిపించడం లేదన్నారు విజయసాయిరెడ్డి.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు.  ఖరగపూర్ – విజయవాడ ఫ్రైట్ కారిడార్ ఒక్కటే కనిపించిందని..దీని వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని చెప్పారు.  11 శాతం కూరగాయలు, పండ్లు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని.. అయినా కానీ కిసాన్ రైళ్లలో ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఏపీకి ఒకటి ఇవ్వాలని కోరామని.. అయినా కనీస విలువివ్వకపోవడం బాధగా ఉందన్నారు.  ధాన్యం సేకరణకు సంబంధించి రూ. 4వేల కోట్ల పైన బకాయిలున్నాయని చెప్పుకొచ్చారు.  రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని… ప్రతి జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి కోరారు.

ఆరోగ్యశ్రీకి పోటీగా ఆయుష్మాన్ భారత్‌ను అన్ని వ్యాధులకు కవర్ చేసేలా రూపొందించాలని కోరుతున్నామన్నారు.  నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరుగుతుందని… దీనిపై కేంద్ర ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించినట్టుగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. పనికి ఆహార పథకం విషయంలో 150 రోజులకు పని దినాలు పెంచాలని మొదటినుంచి కోరుతున్నామని.. దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆశించినట్టుగా బడ్జెట్ లేదని.. ఇది కేంద్ర బడ్జెట్‌లా కాకుండా..కేవలం తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల కోసం రూపొందించిన బడ్జెట్‌లా ఉందని విజయసాయి రెడ్డి విమర్శించారు.

Also Read:

Budget 2021-22: వేటి ధరలు పెరగనున్నాయి.. వేటి ధరలు తగ్గనున్నాయి.. తెలుసుకుందాం పదండి…

Petrol Rate hike : సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్ ఉత్పత్తులపై అగ్రిసెస్

Union Budget 2021 Income Tax: ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు ప్రస్తావన లేని నిర్మలమ్మ బడ్జెట్