వైఎస్ వివేకానంద రెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహంలో వివేకా తుదిశ్వాస విడిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి కడప నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1989, 1994లో పులివెందుల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆగష్టు 8, 1950సంవత్సరంలో జన్మించిన వివేకానంద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ నేతగా ఆయన […]
మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహంలో వివేకా తుదిశ్వాస విడిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డి కడప నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1989, 1994లో పులివెందుల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆగష్టు 8, 1950సంవత్సరంలో జన్మించిన వివేకానంద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం వైసీపీ నేతగా ఆయన ఉన్నారు. ఆయన మృతితో వైఎస్ కుటుంబంలో పాటు పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.