కాలికి గాయమైందని వెళ్తే.. చెయ్యే పొయ్యింది.. బెజవాడ వైద్యుల నిర్లక్ష్యం
ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం మరోసారి కొట్టొచ్చింది. విజయవాడలో జరిగిన ఘటన చూస్తే.. సామాన్య జనం ప్రభుత్వాస్పత్రి వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు అక్కడి వైద్యులు. గాయం ఒక దగ్గరైతే.. వైద్యం మరోచోట చేసి.. ఓ అభాగ్యుడి ప్రాణాలతో చెలగాటమాడారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకి చెందిన రాజు అనే ఓ యువకుడు అక్కడే ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అయితే అతడికి మూడు నెలల క్రితం జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో అతడి కాలుకి గాయమవ్వడంతో.. బెజవాడ ప్రభుత్వాస్పత్రికి చికిత్స […]
ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం మరోసారి కొట్టొచ్చింది. విజయవాడలో జరిగిన ఘటన చూస్తే.. సామాన్య జనం ప్రభుత్వాస్పత్రి వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెచ్చారు అక్కడి వైద్యులు. గాయం ఒక దగ్గరైతే.. వైద్యం మరోచోట చేసి.. ఓ అభాగ్యుడి ప్రాణాలతో చెలగాటమాడారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకి చెందిన రాజు అనే ఓ యువకుడు అక్కడే ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అయితే అతడికి మూడు నెలల క్రితం జరిగిన బైక్ యాక్సిడెంట్‌లో అతడి కాలుకి గాయమవ్వడంతో.. బెజవాడ ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. అయితే అదే అతడికి షాపంగా మారింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వైద్యుడు కాలికి అయిన గాయానికి కుట్లు వేశారు. అనంతరం రెండు చేతులకు రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. అయితే వారం తరువాత బాధితుడి ఎడమ చేయ్యి చలనం లేకుండా పోయింది. దీంతో ఆస్పత్రికి చేరి ఆ వైద్యుడిని ప్రశ్నిచడంతో.. అతడు చెయ్యి విరిగిన వారికి వేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టు వేసి పంపించేశాడు. అయితే ఆ కట్టును గమనించిన రాజు పనిచేసే షాపు యజమాని.. అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. దీంతో ఆ వైద్యులు చెప్పిన వార్త విని షాక్‌కు గురయ్యాడు రాజు. చేతి కండరానికి చేసే ఇంజెక్షన్ కాస్త.. నరానికి తగిలి ఉండొచ్చని తెలిపారు. అయితే ఎడమ వైపు కాబట్టి శస్త్ర చికిత్స చేస్తే.. గుండెకు ప్రమాదకరం అని చెప్పడంతో.. బాధితుడు ఖంగుతిన్నాడు. విషయం తెలియడంతో బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకుని వైద్యులను నిలదీయగా.. వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ వైద్యులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మరి ఉన్నతాధికారులు వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. బాధితుడికి ఎలాంటి సాయం చేస్తారో వేచిచూడాలి.