మహా విషాదం- బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా : వెంకయ్య
విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీకేజి సంఘటన
విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ గ్యాస్ లీకేజి సంఘటన మహా విషాదమనీ, దారుణ ఘటన అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డితో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారనీ, . ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టామని హోంశాఖ కార్యదర్శి తెలిపారనీ వెంకయ్య అన్నారు.