పది రోజుల్లో విశాఖ రైల్వే జోన్ ప్రకటన
విశాఖ: పది రోజుల్లో విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించనుందా? అవును ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటలను బట్టి చూస్తే అలా జరిగేట్టు ఉంది. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. మరో పది రోజుల్లో విశాఖ ప్రజలు శాభవార్త వింటారని వెల్లడించారు. మార్చి 1న విశాఖ రైల్వే గ్రైండ్స్‌లో ప్రధాని మోడీ గారి భారీ బహిరంగ సభ జరగనున్నట్టు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేదీ మేమే, తెచ్చేదీ మేమే. ఆ బాధ్యత తమదేనని […]

విశాఖ: పది రోజుల్లో విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించనుందా? అవును ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటలను బట్టి చూస్తే అలా జరిగేట్టు ఉంది. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. మరో పది రోజుల్లో విశాఖ ప్రజలు శాభవార్త వింటారని వెల్లడించారు. మార్చి 1న విశాఖ రైల్వే గ్రైండ్స్‌లో ప్రధాని మోడీ గారి భారీ బహిరంగ సభ జరగనున్నట్టు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేదీ మేమే, తెచ్చేదీ మేమే. ఆ బాధ్యత తమదేనని విష్ణుకుమార్ రాజు చెప్పారు. అలాంటిది మార్చి 1న జరగనున్న మోడీగారి సభను అడ్డుకుంటామని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు.



