అక్రమార్కులకు మోదీ అండ.. విషయం తెలిస్తే షాక్ !

రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో చౌకీ దార్ చోర్ హై అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ దేశమంతా తిరిగి చెప్పినా నరేంద్ర మోదీకి అవినీతిని ఆపాదించలేకపోయారు. అయితే.. తాజా ఉదంతం మాత్రం మోదీ అక్రమార్కులకు కొమ్ము కాసేలా వుంది. […]

అక్రమార్కులకు మోదీ అండ.. విషయం తెలిస్తే షాక్ !

రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో చౌకీ దార్ చోర్ హై అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ దేశమంతా తిరిగి చెప్పినా నరేంద్ర మోదీకి అవినీతిని ఆపాదించలేకపోయారు.

అయితే.. తాజా ఉదంతం మాత్రం మోదీ అక్రమార్కులకు కొమ్ము కాసేలా వుంది. ఏకంగా కేంద్ర కేబినెట్‌లో బుధవారం తీసుకున్న నిర్ణయం అక్రమార్కులకు మోదీ అండగా నిలుస్తున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా వున్న ఈ అక్రమార్కులు ఒక్కరూ.. ఇద్దరో  లేక పది మందో కాదు.. ఏకంగా 40 లక్షల మంది అక్రమార్కులకు ప్రదాని నరేంద్ర మోదీ అండగా నిలుస్తూ కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

షాక్ గురవుతున్నారా ? ఎస్.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దేశ రాజధానిలో అక్రమంగా చిన్నా చితకా నివాస గృహాలు.. గుడిసెలు.. రేకుల ఇళ్ళు కట్టుకుని నివసిస్తున్న సుమారు 40 లక్షల మంది నివాసాలను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. ఏకంగా 40 లక్షల మంది జీవితాల్లో ఆనందం వెల్లి విరిసే నిర్ణయాన్ని మోదీ సర్కార్ తీసుకుంది.

అయితే వీరంతా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని నివసిస్తున్నవారే. కానీ వారిని ఉన్నపళంగా అక్కడ్నించి తరిమేయకుండా.. వారంతా అక్రమంగా నివసిస్తున్న వారైనా.. వారంతా అక్రమంగా భూములు ఆక్రమించుకుని నివాస ఆవాసాలను ఏర్పాటు చేసుకున్న వారైనా.. మానవతా దృక్పథంతో వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈరకంగా నరేంద్ర మోదీ అక్రమార్కులకు అండగా నిలచినట్లయ్యారు.

మరో 6 నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ సర్కార్ ఏకంగా 40 లక్షల మంది నిరుపేదలకు వారుంటున్న ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగున్నట్లు సుస్పష్టంగా కనిపిస్తోంది. అక్రమంగా నివసిస్తున్నా వారి జీవన స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం వారందరి నివాస గృహాలను, వారుంటున్న భూములను రెగ్యులరైజ్ చేయబోతోంది. సో.. డబుల్ ధమాకా అంటే ఇదేనేమో.. !