AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gayatri Gupta: ‘చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి’.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో.. ఏం జరిగిందంటే?

పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గాయత్రీ గుప్తా తరచూ తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొందరు ప్రొడ్యూసర్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరో సంచలన వీడియోతో అందరికీ షాక్ ఇచ్చిందీ టాలీవుడ్ నటి.

Gayatri Gupta: 'చావు అంచున ఉన్నాను.. నన్ను కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో.. ఏం జరిగిందంటే?
Gayatri Gupta
Basha Shek
|

Updated on: Jun 22, 2026 | 6:43 PM

Share

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ సాయి పల్లవికి ఫ్రెండ్ గా నటించింది. దీంతో పాటు కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్, అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్ తదితర సినిమాలు, వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసింది. అయితే సినిమాలతో పాటు ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలిచింది గాయత్రి. ముక్కు సూటిగా, ధైర్యంగా మాట్లాడేతత్వమున్న ఆమె కొందరు ప్రొడ్యూసర్లు తనను లైంగికంగా వేధించారంటూ సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ బోల్డ్ వీడియోస్ పెట్టి షాకులు ఇస్తుంటుంది. తాజాగా ఆమె మరో సంచలన వీడియోను పోస్ట్ చేసింది.

‘గత కొన్ని నెలలుగా నాకు తీవ్రమైన పానిక్ అటాక్ వస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రస్తుతం లైంగిక వేధింపుల వల్ల కలిగిన తీవ్రమైన మానసిక గాయంతో బాధపడుతున్నాను. నాకు సాయం కావాలి. నేను థెరపీ తీసుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాను, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. వాయిస్ ఆఫ్ ఉమెన్ వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎవరిని ఆశ్రయించాలో, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నన్ను ఆదుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. చావు అంచున ఉన్న నన్ను నేను కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.. ఎవరితోనైనా మాట్లాడి సహాయం పొందడమే. నా వ్యక్తిగత జీవితంలో సహాయం కోసం ప్రయత్నించాను, కానీ ఎక్కడా ఎలాంటి సాయం దొరకలేదు. ఏదైనా చేయడానికి నాకు ఒక లాయర్ అవసరమా? లేదా థెరపిస్ట్ అవసరమా? అనేది నాకు తెలియదు’

ఇవి కూడా చదవండి

‘ఇప్పుడు కూడా నేను తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాను. సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. సహాయం ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు అది చాలా అవసరం. అండగా ఉంటాం, తోడుగా ఉంటాం అని సోషల్ మీడియాలో చెప్పే డ్రామాలు, మాటలు కోకొల్లలు.. కానీ నిజానికి ఎవరికీ ఏమాత్రం పట్టదు. పైకి మాత్రం తాము పట్టించుకుంటున్నట్లు నటిస్తారు. ఎవరికీ నిజంగా నా మీద శ్రద్ధ లేదు’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది గాయత్రి. అయితే ఏమైందో తెలియదు కానీ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే డిలీట్ కొట్టేసిందీ టాలీవుడ్ నటి.

కాశీలో గాయత్రీ గుప్తా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
నిర్జల ఏకాదశి.. తులసితో ఈ చిన్న పరిహారాలు చేస్తే ధనలక్ష్మి..
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
1998లో వచ్చిన సినిమా.. నా కెరీర్‏లోనే పీక్ షాట్ అది.. జగపతి బాబు.
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!