చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై హైకోర్టు 8వారాల పాటు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఇప్పటికే జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నాడని చెన్నమనేని తరపు లాయర్ వాదించారు. రెండు పౌరసత్వాల ఆధారాలు చూపించాలని, అతనికి జర్మనీ పౌరసత్వం ఇంకా ఉందా […]
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై హైకోర్టు 8వారాల పాటు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఇప్పటికే జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నాడని చెన్నమనేని తరపు లాయర్ వాదించారు. రెండు పౌరసత్వాల ఆధారాలు చూపించాలని, అతనికి జర్మనీ పౌరసత్వం ఇంకా ఉందా లేదా అనే విషయంపై నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పిటిషనర్ ను ఆదేశించింది.