AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్ : ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేని దోషిగా నిర్ధారించిన కోర్టు

ఉన్నావ్ రేప్  కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందే తెలిసిందే. ఈ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను తీస్‌హజారీ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నేపథ్యంతో ఈ నెల 19న శిక్ష ఖరారు చేయనుంది. ఐపీసీతో పాటు ఫోక్సో చట్టం ప్రకారం శిక్షను విధించనుంది న్యాయస్థానం.  ఈ కేసు విచారణలో జాప్యం చేసిన సీబీఐపై కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నావ్‌లో 2017 సంవత్సరంలో ఓ మైనర్ బాలిక  ఉద్యోగం […]

బిగ్ బ్రేకింగ్ : ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేని దోషిగా నిర్ధారించిన కోర్టు
Ram Naramaneni
|

Updated on: Dec 16, 2019 | 4:08 PM

Share

ఉన్నావ్ రేప్  కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందే తెలిసిందే. ఈ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను తీస్‌హజారీ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నేపథ్యంతో ఈ నెల 19న శిక్ష ఖరారు చేయనుంది. ఐపీసీతో పాటు ఫోక్సో చట్టం ప్రకారం శిక్షను విధించనుంది న్యాయస్థానం.  ఈ కేసు విచారణలో జాప్యం చేసిన సీబీఐపై కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉన్నావ్‌లో 2017 సంవత్సరంలో ఓ మైనర్ బాలిక  ఉద్యోగం కోసం స్థానిక ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఇంటికి వెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత కూడా కొందరు వ్యక్తలు ఆమెను కిడ్నాాప్ చేసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తన బలం, బలగంతో బాధితురాలి ఫ్యామిలీపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తండ్రిని తీవ్రంగా గాయపర్చడంతో పాటు అక్రమ ఆయుధాల కేసును పెట్టి అరెస్ట్ చేయించారు. పోలీస్ కస్టడీలో ఉండగానే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.   తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తుండటంతో,  తీవ్ర భావోద్వేగానికి గురైన బాధితురాలు  సీఎం ఇంటి ముందు సుసైడ్ అటెమ్ట్ చేసింది. ఆ తర్వాత ఈ  కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ను అరెస్టు చేసినా కూడా బాధితురాలికి కష్టాలు తప్పలేదు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా లారీతో ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు చనిపోగా, బాధితురాలు పక్షాన వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది గాయపడ్డారు.

Follow Us
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి
15 రోజులైనా భారత గూఢచారుల జాడలేదు! అజిత్ ధోవల్
15 రోజులైనా భారత గూఢచారుల జాడలేదు! అజిత్ ధోవల్
పంచకం ప్రారంభం.. ఈ 5 పనులు అస్సలు చేయకండి! ఏ పనులకు దూరంగా..
పంచకం ప్రారంభం.. ఈ 5 పనులు అస్సలు చేయకండి! ఏ పనులకు దూరంగా..
రైలు ప్రయాణంలో లగేజీ పోయిందా..? పరిహారం పొందవచ్చు.. ఎలా అంటే..
రైలు ప్రయాణంలో లగేజీ పోయిందా..? పరిహారం పొందవచ్చు.. ఎలా అంటే..
యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు.. అక్టోబర్ 15 తర్వాత..
యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు.. అక్టోబర్ 15 తర్వాత..
వైభవ్ సూర్యవంశీకి కివీస్ కోచ్ వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి కివీస్ కోచ్ వార్నింగ్
సెప్టెంబర్ నెలాఖరులో వీరికి అదృష్టం.. ఈ రాశులకు మహా భాగ్య యోగం!
సెప్టెంబర్ నెలాఖరులో వీరికి అదృష్టం.. ఈ రాశులకు మహా భాగ్య యోగం!
దేశంలోనే అతిపెద్ద గణపతి బప్పా ఇక్కడే.. దర్శిస్తే కష్టాలు తొలగి..
దేశంలోనే అతిపెద్ద గణపతి బప్పా ఇక్కడే.. దర్శిస్తే కష్టాలు తొలగి..