AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ : ఆ మహిళ ఏం చేసిందంటే ?

కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని మార్చిన, ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దని ఎంత చెప్తున్నా ముమ్మారు తలాక్ చెప్పే ప్రబుద్ధులు మాత్రం మారడం లేదు. సరికదా మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఒక ప్రబుద్దున్ని ఏమి చేయలేక పోలీసులు సైతం చేతులెత్తేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. వాట్సాప్ లో వాయిస్ మెస్సేజ్ ద్వారా తన భర్త త్రిపుల్ తలాఖ్ చెప్పాడని ఫిర్యాదు చేస్తూ […]

వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ : ఆ మహిళ ఏం చేసిందంటే ?
Rajesh Sharma
|

Updated on: Sep 19, 2019 | 6:53 PM

Share

కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని మార్చిన, ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దని ఎంత చెప్తున్నా ముమ్మారు తలాక్ చెప్పే ప్రబుద్ధులు మాత్రం మారడం లేదు. సరికదా మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఒక ప్రబుద్దున్ని ఏమి చేయలేక పోలీసులు సైతం చేతులెత్తేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. వాట్సాప్ లో వాయిస్ మెస్సేజ్ ద్వారా తన భర్త త్రిపుల్ తలాఖ్ చెప్పాడని ఫిర్యాదు చేస్తూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించిన ఉదంతం బుధవారం నాడు కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. దుబాయ్‌లో ఉంటున్న తన భర్త ముస్తాఫా బేగ్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తనకు త్రిపుల్ తలాక్ చెప్పాడని పోలీసుల ఎదుట వాపోయిన బాధిత మహిళ.. తాను ఈ విడాకులకు అంగీకరించబోనని స్పష్టంచేశారు. అంతేకాకుండా తనకు న్యాయం జరిగే వరకు తన భర్తపై న్యాయ పోరాటం చేస్తానని తేల్చిచెప్పారామె. పోలీసులను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం బుధవారం రాత్రి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ముస్తఫా బేగ్ దుబాయ్‌లో ఉంటున్నందున ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారని మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు. శివమొగ్గలో ల్యాప్ టాప్, సీసీ కెమెరాల టెక్నిషియన్‌గా పనిచేసిన ముస్తఫా బేగ్‌తో తనకు 20 ఏళ్ల క్రితమే వివాహమైందని.. కొంతకాలం క్రితమే జీవనోపాధి కోసం తనను, పిల్లలను విడిచి అతను దుబాయ్ వెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం వరకు నెలకు రూ.13,000 పంపించిన తన భర్త.. ఇటీవల కాలంలో ఫోన్ చేయడం, డబ్బులు పంపించడం మానేశాడని.. ఇప్పుడు ఏకంగా త్రిపుల్ తలాక్ చెప్పాడని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

Follow Us
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
మహిళలూ మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేయకండి..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కాన్వాయ్‌పై కాల్పులు
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
ఉదయం నిద్రలేవగానే కళ్ల బరువు, వాపు వేధిస్తున్నాయా? కారణాలు ఇవే.. 
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పచ్చికొబ్బరి తింటున్నారా? రోజూ తినేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..