మాజీ గవర్నర్ మౌనం వెనుక ?

బీజేపీలో సీనియర్ నేత, మహారాష్ట్రకు మొన్నటి దాకా గవర్నర్ గా వ్యవహరించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. గవర్నర్ గిరి పోగానే తిరిగి హైదరాబాద్ వచ్చేసిన విద్యాసాగర్ రావు ఇటీవలే బీజేపీలో మళ్ళీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. రాజకీయాల్లో ఇక యమా యాక్టీవ్ గా ఉంటానని కూడా సెలవిచ్చారు. అయితే ఇవాళ అనూహ్యంగా అయన వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితురాలైన తమిళిసై సౌందర్ రాజన్ ను విద్యాసాగర్ రావు […]

మాజీ గవర్నర్ మౌనం వెనుక ?
Follow us
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2019 | 5:36 PM

బీజేపీలో సీనియర్ నేత, మహారాష్ట్రకు మొన్నటి దాకా గవర్నర్ గా వ్యవహరించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. గవర్నర్ గిరి పోగానే తిరిగి హైదరాబాద్ వచ్చేసిన విద్యాసాగర్ రావు ఇటీవలే బీజేపీలో మళ్ళీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. రాజకీయాల్లో ఇక యమా యాక్టీవ్ గా ఉంటానని కూడా సెలవిచ్చారు. అయితే ఇవాళ అనూహ్యంగా అయన వార్తల్లోకి ఎక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితురాలైన తమిళిసై సౌందర్ రాజన్ ను విద్యాసాగర్ రావు ఇవాళ రాజ్ భావం లో కలిశారు. అయన సడన్ రాక వెనుక కారణాలు తెలియలేదు కానీ, కొత్త గవర్నర్ ను మర్యాద పూర్వకంగానే సాగర్ జీ కలుస్తున్నారు అయన అనుచర వర్గం, పార్టీ శ్రేణులు మీడియా కు సమాచారం అందించారు. మీడియా సహజంగానే రాజభవన్ కు ఉరుకులు, పరుగులు పెట్టింది. తమిళిసై ని కల్సిన విద్యాసాగర్ రావు ఆమెతో పది నిముషాలు చర్చలు జరిపారు. ఎదో ఆసక్తికరంగానే ఉన్నట్టుంది అని మీడియా ఆసక్తి తో రాజ్ భవన్ ముందు పడిగాపులు కాసింది. పది నిముషాలు కాగానే విద్యాసాగర్ రావు యమా సీరియస్ గా రాజ్ భవన్ నుంచి బయటికొచ్చారు.. అంతే సీరియస్ గా అక్కడ్నించి వెళ్లిపోయారు. మీడియా పలకరిస్తున్న కూడా అయన తలెత్తి చూడలేదు సరికదా కనీసం మీడియా ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోనట్టుగా వెళ్లిపోయారు. ఒకప్పుడు మీడియా ఫ్రెండ్లీ గా ఉండే సాగర్ జీ ఇలా సడన్ గా, సీరియస్ గా వెళ్లిపోవడంతో మీడియా అవాక్కయింది. ఇంతకీ ఏమై ఉంటుంది చెప్మా అని మీడియా వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి..