పాదయాత్రా? ప్రత్యేక రాయల సీమా ? కమలం కొత్త వ్యూహమేంటి ??
అధికారం కోసం పార్టీలు, నాయకులు ఏమైనా చేసే జమానా ఇది. ఎన్ని ప్రయత్నాలు చేసిన తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయలేకపోతున్న బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడకు తెరలేపోతోందా ? చిన్న రాష్ట్రాలకు మొదట్నుంచి అనుకూలంగా ఉన్న బీజేపీ నేతలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిస్థితిని తీసుకువెళ్తున్నారా ? పరిస్థితి, కమలనాథుల కదలికలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు […]
అధికారం కోసం పార్టీలు, నాయకులు ఏమైనా చేసే జమానా ఇది. ఎన్ని ప్రయత్నాలు చేసిన తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయలేకపోతున్న బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నమేమీ కాదు. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ కొత్త ఎత్తుగడకు తెరలేపోతోందా ? చిన్న రాష్ట్రాలకు మొదట్నుంచి అనుకూలంగా ఉన్న బీజేపీ నేతలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిస్థితిని తీసుకువెళ్తున్నారా ? పరిస్థితి, కమలనాథుల కదలికలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కర్నూల్ సెంట్రిక్ గా పలు అంశాలను తెరమీదికి తెస్తున్నారు. కర్నూల్ ని రెండో రాజధాని చేయాలని, హై కోర్ట్ అక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ రాయలసీమ పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది.
రాయలసీమ విషయంలో బీజేపీ మెల్లగా తన కార్యాచరణను అమల్లోకి పెడుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో త్వరలో.. రాయలసీమలో పాదయాత్ర నిర్వహించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయంలో అనంతపురం పర్యటనలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం.. కడపలో సమావేశమైన బీజేపీ సీనియర్ నేతలు.. ఓ డిక్లరేషన్ ను ప్రకటించారు. దాని ప్రకారం.. జీవీఎల్ తన డిమాండ్లను వినిపించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. 3నెలల్లో అనంతపురం జిల్లాలో 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… అది బాధాకరమన్నారు. రాయలసీమవాళ్లు సీఎం అయినా అభివృద్ధి జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో నిర్ణయం రాష్ట్రానిదే, కేంద్రం జోక్యం ఉండదన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. పాదయాత్ర ఆలోచన బాగానే ఉన్నప్పటికి… ఈ పాదయాత్రలో ఎవరెవరు కలిసి నడుస్తారన్నది ప్రస్తుతం అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం జివిఎల్ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ అయన ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల టిడిపి రాజ్యసభా పక్షం బీజేపీ లో వేలీనమైంది. సుజనా, టిజి వంటి ఎంపీలు కమల తీర్థం పుచ్చుకున్నారు. వీరితో కల్సి పాదయాత్రకు బీజేపీ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం.
ఏపీ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో కల్సి రాయలసీమలో పాదయాత్ర చేసేందుకు కమలదళం సిద్ధం అవుతోంది. పాదయాత్ర సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష గనక కొద్దిగా నైనా కనిపిస్తే, వినిపిస్తే దాని ఆధారంగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు దిశగా వ్యూహరచన చేయొచ్చన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన అన్నది ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. అసలే వనరుల కొరతతో ఆర్థికంగా వీక్ గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని మరో ముక్కగా చేయడం ద్వారా బీజేపీ అధికారం లోకి రావచ్చేమో గాని రాష్ట్రాన్ని ఫీజిబిలిటీ ఉన్న స్టేట్ గా చేయడం మాత్రం అసాధ్యమన్న విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏది ఏమైనా పాదయాత్రలో కమల నాథులకు ఎలాంటి స్పందన లభిస్తుందో ? బీజేపీ నేత ఆశలు ఏ మేరకు నెరవేరతాయో తెలియాలంటే ఇంకొంత కలం వేచి చూడాల్సిందే !